గాసిప్స్ న్యూస్

పుష్ప పై సడెన్ షాకిచ్చే న్యూస్…ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు…కానీ!!

ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఊహించనిది ఇప్పుడు జరిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల మాస్టారు సుకుమార్ ల కాంబినేషన్ లో ఆర్య సిరీస్ తర్వాత రూపొందుతున్న సినిమా పుష్ప, భారీ ఎత్తున పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగగా రీసెంట్ గా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన షూటింగ్ కి కొంచం గ్యాప్ వచ్చినట్లు అయింది అని చెప్పాలి.

ఇలాంటి టైం లో రీసెంట్ గా సినిమా లో అల్లు అర్జున్ ఇంట్రో టీసర్ ని రిలీజ్ చేయగా టాలీవుడ్ చరిత్ర లో సరికొత్త రికార్డులతో దుమ్ము దుమారం చేసింది ఈ టీసర్. టీసర్ కి వచ్చిన రెస్పాన్స్ వలనో సినిమా పై ఉన్న క్రేజ్ వలనో కానీ ఇప్పుడు ఈ సినిమా పై…

అల్లు అర్జున్ మరియు సుకుమార్ లు ఒక కొత్త ప్లాన్ వేసారని తెలుస్తుంది. అదేంటంటే… పుష్ప సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రెండు పార్టులుగా రావడానికి సిద్ధం అవుతుందని సమాచారం. మొదటి పార్ట్ ఈ ఇయర్ ఎండ్ వరకు అలాగే సెకెండ్ పార్ట్ వచ్చే సరికి…

వచ్చే ఇయర్ సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట. సినిమా రఫ్ కట్ రషెస్ ఇప్పటి వరకు చూసుకున్న తర్వాత లెంత్ మరీ ఎక్కువ అయ్యేలా అనిపిస్తూ ఉండటం తో చాలా సీన్స్ ని స్క్రిప్ట్ దశలోనే సుకుమార్ తొలగించాలని అల్లు అర్జున్ తో కలిసి మాట్లాడిన టైం లో అల్లు అర్జున్ అలా కాకుండా కుదిరితే ఇలా అన్ని సీన్స్ ని పెట్టి…

రెండు పార్టులుగా చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనని చెప్పగా దానికి సుకుమార్ కూడా ఆలోచించి తర్వాత టీం తో డిస్కస్ చేసి ఓకే అలానే చేద్దాం అంటూ చెప్పుకోచ్చారని సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇది నిజం అయితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత స్పెషల్ రికార్డులతో దుమ్ము లేపోచ్చు.

Leave a Comment