గాసిప్స్ న్యూస్

పుష్ప విలన్ కి రికార్డ్ రెమ్యునరేషన్…ఈ రేంజ్ రేటు ఏంటి సామి అసలు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల మాస్టార్ సుకుమార్ ల కాంబినేషన్ లో ఆర్య సిరీస్ తర్వాత రూపొందుతున్న సినిమా పుష్ప, ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ సెన్సేషనల్ మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. బాక్స్ ఆఫీస్ బరిలో ఆగస్టు 13 న దిగబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ రోల్ చాలా స్పెషల్ గా ఉండబోతుండగా…

అల్లు అర్జున్ కి పోటిగా ఎవరు నటిస్తారు అన్నది చాలా ఆసక్తిని క్రియేట్ చేయగా ముందుగా విజయ్ సేతుపతి ని విలన్ రోల్ కి అనుకున్నా కొన్ని కారణాల వలన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న విజయ్ సేతుపతి ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారో అని అందరూ ఎదురు చూడగా…

కొంత భాగం షూటింగ్ ని పూర్తీ చేసుకున్న తర్వాత రీసెంట్ గా మలయాళ టాలెంటెడ్ హీరో ఫహాద్ ఫాజిల్ ను సినిమాలో విలన్ గా సెలెక్ట్ చేసుకోగా రెమ్యునరేషన్ కూడా భారీగా ఇవ్వబోతున్నారని తెలుస్తుంది, ఇది వరకు విజయ్ సేతుపతి కి విలన్ రోల్ కి గాను సుమారు…

4 కోట్ల రేంజ్ లో ఆఫర్ చేయగా ఇప్పుడు రేటు పెంచి ఫహాద్ ఫాజిల్ కి ఏకంగా 5 కోట్ల భారీ రెమ్యునరేషన్ ని ఇవ్వబోతున్నారని సమాచారం. ఆ రేటు ఎంతైనా సినిమా కి మలయాళ మార్కెట్ లో మరింత క్రేజ్ ఫహాద్ ఫాజిల్ రాకతో సొంతం అవ్వడం ఖాయం, ఈ హీరో కి తమిళ్ లో కూడా మంచి డిమాండ్ ఉండటం తో ఆ ఇంపాక్ట్ తమిళ్ లో…

కూడా గట్టిగా ఉండే అవకాశం ఉంది, మలయాళ మార్కెట్ లో అల్లు అర్జున్ కి ఆల్ రెడీ సాలిడ్ క్రేజ్ ఉండగా ఇప్పుడు మరింత బూస్టప్ దొరికింది అని చెప్పొచ్చు. ఇక ఈ రేంజ్ రెమ్యునరేషన్ తో వన్ ఆఫ్ మోస్ట్ పెయిడ్ విలన్ రోల్ కి ఫహాద్ ఫాజిల్ జీవం ఏ రేంజ్ లో పోసి అల్లు అర్జున్ కి విలన్ గా ఎలాంటి టఫ్ ఫైట్ ఇస్తాడు అన్నది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది అని చెప్పొచ్చు.

Leave a Comment