న్యూస్

పుష్ప ‘శ్రీవల్లి’ సాంగ్ 24 గంటల రిపోర్ట్ ఇదే!!

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సెన్సేషన్ పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ నెలలో సంచలన కలెక్షన్స్ తో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమాలో సాంగ్స్ ఇప్పుడు ఒక్కొటిగా రచ్చ చేస్తున్నాయి. మొదటి పాట దాక్కో దాక్కో మేక సంచలన రికార్డులను నమోదు చేయగా ఇప్పుడు సినిమాలోని రెండో సాంగ్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.

రష్మిక క్యారెక్టర్ పై రూపొందిన రెండో పాట శ్రీవల్లి కి ఇన్స్టంట్ గా పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రాగా సాంగ్ లో అల్లుఅర్జున్ సింపుల్ బ్యూటిఫుల్ స్టెప్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక సాంగ్ 24 గంటల్లో సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…

తెలుగు వర్షన్ 24 గంటల్లో 6.98 మిలియన్ వ్యూస్ ని అందుకోగా లైక్స్ 499.7K మార్క్ ని అందుకుంది… వ్యూస్ పరంగా టాప్ 5 ప్లేస్ ను లైక్స్ పరంగా టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకోగా అన్ని భాషలు కలిపి 24 గంటల్లో 11 మిలియన్ వ్యూస్ ని 740k ప్లస్ లైక్స్ ని అందుకుందని అనౌన్స్ చేశారు. ఓవరాల్ గా రెస్పాన్స్ బాగుందని చెప్పొచ్చు.

Leave a Comment