న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

పెద్దన్న తెలుగు బిజినెస్ అండ్ టోటల్ థియేటర్స్ కౌంట్…ఊరమాస్ ఇది!!

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అన్నాట్టే తెలుగులో పెద్దన్న పేరుతో డబ్ అయ్యి రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోనుంది, సెకెండ్ వేవ్ తర్వాత ఇండియా లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ ఈ సినిమా కి సొంతం అయ్యింది అని చెప్పాలి. ముందుగా ఓవరాల్ గా సినిమా సాధించిన బిజినెస్ ను గమనిస్తే…

నైజాంలో 4.5 కోట్ల బిజినెస్ ను ఆంద్రలో 5 కోట్ల బిజినెస్ ను సీడెడ్ లో 3 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 12.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. దాంతో సినిమా తెలుగు లో ఇప్పుడు క్లీన్ హిట్ గా….

నిలవాలి అంటే మినిమం 13 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. రీసెంట్ రజినీ మూవీస్ సంక్రాంతి తీవ్ర పోటిలో బరిలోకి దిగాయి, దాంతో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేదు, కానీ ఈ సారి దీపావళికి హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది కాబట్టి హిట్టు కొట్టే ఛాన్స్ ఎంతైనా ఉంది.

ఇక సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే… నైజాంలో 236 థియేటర్స్ లో రిలీజ్ కానున్న సినిమా ఆంధ్ర రీజన్ లో 290 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా సీడెడ్ ఏరియాలో 120 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దాంతో టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 650 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోనుంది.

ఇక తమిళనాడులో 400 కి పైగా థియేటర్స్ లో టోటల్ ఇండియాలో 1300 కి పైగా థియేటర్స్ లో ఓవర్సీస్ లో 1000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది ఈ సినిమా. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు అంచనాలను తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ పరంగా అంచనాలను మించుతుందో లేదో చూడాలి ఇక…

Leave a Comment