న్యూస్

పెద్ద పెద్ద సినిమాల వల్ల కానిది…చిన్న సినిమా చేసింది…సాలిడ్ వ్యూస్ తో దూసుకుపోతున్న మిడిల్ క్లాస్ మెలొడిస్!!

కొన్ని సార్లు భారీ ఆశలు పెట్టుకున్న పెద్ద సినిమాల కన్నా కూడా చిన్న సినిమాలే అంచనాలను మించి ఆకట్టుకుంటాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ చేసుకునే అవకాశం లేదు కానీ ఉన్నంతలో డైరెక్ట్ రిలీజ్ లో భాగంగా ఒకటి తర్వాత ఒకటి సినిమాలు రిలీజ్ అవుతూ వస్తుండగా వాటిలో ఎక్కువ శాతం సినిమాలు అంచనాలను అందుకోలేక పోతున్నాయి, కోట్లకి కోట్లు డబ్బు పెట్టి కొనే అలావాటు ఉన్న అమెజాన్ ప్రైమ్ అయితే…

ఒకటి తర్వాత ఒకటి అంటూ చాలా సినిమాలను కొనగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన సూర్య ఆకాశం నీ హద్దు రా సినిమా తో తొలి కమర్షియల్ హిట్ ని సొంతం చేసుకోగా ఈ సినిమా వచ్చిన వారం తర్వాత రిలీజ్ అయిన మరో సినిమా మిడిల్ క్లాస్ మెలోడిస్ కూడా…

మంచి టాక్ ని సొంతం చేసుకోగా సాలిడ్ వ్యూస్ తో దూసుకు పోతుంది, కాగా చిన్న సినిమానే అవ్వడం అమెజాన్ ప్రైమ్ కేవలం 4.5 కోట్ల రేటుకే సినిమా ను కొన్న కానీ ప్రైమ్ లో నవంబర్ నెలకి గాను హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న రెండో సినిమా గా నిలిచిందట ఈ సినిమా.

ఒక పక్క ఆకాశం నీ హద్దు రా రెచ్చి పోతూ ఉంటె మరో పక్క ఈ సినిమా కి కూడా అద్బుతమైన వ్యూస్ వస్తున్నాయని సమాచారం. నవంబర్ నెలలో టాప్ 2 ట్రెండింగ్ మూవీ గా అమెజాన్ ప్రైమ్ లో నిలిచిన ఈ సినిమా ఎంతవరకు యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుంది లాంటి వివరాలు…

ఇంకా రివీల్ అవ్వాల్సి ఉంది. నెల కంప్లీట్ అయ్యాక యూనిక్ వ్యూస్ లెక్కలు బయటికి వస్తాయి. మొత్తం మీద రేటు చిన్నదే అవ్వడం తో కచ్చితంగా మొదటి నెల వ్యూస్ తోనే సినిమా కి పెట్టిన రేటు వెనక్కి రావడమే కాకుండా ప్రాఫిట్ కూడా వచ్చి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి…

Leave a Comment