న్యూస్ బాక్స్ ఆఫీస్

పోతరాజు వీరంగం…51.2Cr ఔట్…ఇవాల్టితో కొత్త రికార్డ్ పక్కా!!

మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇవ్వాలని ప్రతీ ఒక్కరు కోరుకున్నారు, అందరూ కోరుకున్నట్లుగానే రవితేజ ఇప్పుడు క్రాక్ సినిమా తో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. 4 బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తో తర్వాత క్రాక్ రిలీజ్ రోజు ఎదురుకున్న ఇబ్బందులు, తర్వాత థియేటర్స్ సమస్యలు తలెత్తడం లాంటివి జరిగినా కానీ అవేవి కూడా…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇసుమంత కూడా ఇబ్బంది పెట్టకుండా సెన్సేషనల్ కలెక్షన్స్ ని వచ్చేలా చేయగా ఇప్పుడు రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాస్ వసూల్ చేసిన సినిమాగా నిలవడానికి సిద్ధం అయ్యింది క్రాక్ సినిమా. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 వ రోజు కలెక్షన్స్ లెక్క…

అవలీలగా 1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకునేలా ఉండగా టోటల్ గా గ్రాస్ లెక్క 51.2 కోట్ల మార్క్ ని అందుకోనుంది. రవితేజ కెరీర్ లో ఇది వరకు బలుపు సినిమా 49 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని, తర్వాత రాజా ది గ్రేట్ సినిమా 51.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సాధించాయి…

బలుపుని ఆల్ రెడీ క్రాస్ చేసిన క్రాక్ సినిమా సినిమా ఇప్పుడు రాజా ది గ్రేట్ సినిమా కలెక్షన్స్ కి అతి చేరువగా రాగా 13 వ రోజు కలెక్షన్స్ తో సినిమా 51 కోట్ల మార్క్ ని అందుకోగా 14 వ రోజు నుండి మళ్ళీ వీకెండ్ అవ్వడం ఇప్పుడు థియేటర్స్ కూడా మరిన్ని పెరగడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు సాలిడ్ గా కొనసాగే అవకాశం ఉందని చెప్పాలి. దాంతో ఇప్పుడు 14 వ రోజు సాధించే కలెక్షన్స్ తో…

రవితేజ కెరీర్ లో నంబర్ 1 గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా సంచలనం సృష్టించబోతుంది క్రాక్ సినిమా… అది కూడా 50% ఆక్యుపెన్సీతో, మొదటి రోజు రిలీజ్ కి ఇబ్బందులు, థియేటర్స్ సమస్యలను ఎదురుకుని అన్నింటికి మించి 4 బాక్ టు బాక్ డిసాస్టర్ల తర్వాత ఈ రేంజ్ లో జోరు చూపడం సంచలనం అనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా 62-65 కోట్ల రేంజ్ గ్రాస్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

Leave a Comment