గాసిప్స్ న్యూస్

ప్రస్తుతానికి ప్రభాస్ V ఎన్టీఆర్ V మహేష్….అప్పుడు ఏమవుతుందో మరి!

అప్పుడప్పుడు సినీ ఇండస్ట్రీలో కొందరితో అనుకున్న సినిమాలు కాన్సిల్ అయ్యి వేరే వాళ్ళతో సెట్ అవుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం, లేటెస్ట్ గా ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ ఉండాల్సింది కానీ అది సడెన్ గా కాన్సిల్ అయ్యి ఎన్టీఆర్ కొరటాల తో సినిమాను కమిట్ అవ్వగా త్రివిక్రమ్ సడెన్ గా మహేష్ బాబు తో సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ న్యూస్ రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు టీం.

కాగా ఇప్పుడు ఈ సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతానికి పోటి పడబోతున్నాయి. అన్ని సినిమాలు ఓకే సీజన్ ను టార్గెట్ చేసి ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముందుగా ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న అప్ కమింగ్ మూవీ…

సాలార్ ను వచ్చే ఇయర్ సంక్రాంతికి కాకుండా వచ్చే ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా తీసుకు రావాలని డిసైడ్ అవ్వగా, ఈ సినిమా వచ్చిన 2 వారాల తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ ల కాంబినేషన్ లో వస్తున్న సెకెండ్ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుందని పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇప్పుడు వీటితో పాటు మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న హాట్రిక్ మూవీ కూడా వచ్చే ఇయర్ సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు వస్తుందని అనౌన్స్ చేశారు. దాంతో ప్రస్తుతానికి ఈ మూడు సినిమాలు వచ్చే ఇయర్ ఈ టైం లో బాక్స్ ఆఫీస్ బరిలో పోటి లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. కానీ…

ప్రస్తుతం ఉన్న సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ఎప్పుడు తగ్గుతుంది అన్న దానిమీద అలాగే ఈ టైం లో రావాల్సిన సినిమాల పోస్ట్ పోన్ వలన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ టైం కి రిలీజ్ లో కొన్ని సినిమాలే ఉండే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరి ఫైనల్ గా పోటి లో ఏ సినిమాలు ఉంటాయి అన్నది ఇంకా కొద్ది టైం తర్వాత క్లారిటీ వస్తుంది.

Leave a Comment