న్యూస్ రివ్యూ

ఫలక్ నుమా దాస్ రివ్యూ…రేటింగ్…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

చిన్న సినిమాల్లో ఈ ఇయర్ లో మంచి బజ్ ని సొంతం చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఫలక్ నుమా దాస్. ప్రీమియర్ షోల తో పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ షోల అసలు రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ.. ముందుగా కథ విషయానికి వస్తే చిన్నప్పటి నుండి గ్యాంగ్ లీడర్ అవ్వాలి అనుకునే హీరో పెద్ద అయ్యాక తన గ్యాంగ్ తో హవా చూపుతుండగా…

ఆ ఏరియా దాదా చనిపోవడం, అ కేస్ లో హీరో ఇరుక్కోవడం తో సినిమా టర్న్ తీసుకుంటుంది, తర్వాత ఎం జరిగింది అన్నది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా పాయింట్ ఎలా ఉన్నా ఫస్టాఫ్ వరకు పక్కా పైసా వసూల్ మూవీ ఫలక్ నుమా దాస్. 

పక్కా లోకల్ స్లాంగ్ తో అందరు దుమ్ము లేపారు, కామెడీ ఫైట్స్ అన్నీ ఫస్టాఫ్ వరకు బాగా సెట్ అయ్యాయి. దాంతో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచుకోగా సెకెండ్ ఆఫ్ పూర్తిగా గాడి తప్పి ఎటు నుండి ఏటో పోతూ క్లైమాక్స్ చేరి, ఆ క్లైమాక్స్ కూడా ఆకట్టుకోలేక పోతుంది.

ఓవరాల్ గా విశ్వక్ సేన్ నటన ఆకట్టుకోగా డైరెక్షన్ ఫస్టాఫ్ కుమ్మినా సెకెండ్ ఆఫ్ దొబ్బింది, హీరోయిన్స్ జస్ట్ ఓకే, మిగిలిన రోల్స్ లో తరుణ్ భాస్కర్ ఆకట్టుకోగా, సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా రేంజ్ లో బాగానే ఉన్నాయి.

ఓవరాల్ గా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే
*హీరో క్యారెక్టర్
*ఫస్టాఫ్
*బ్యాగ్రౌండ్ స్కోర్
*కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్
*సెకెండ్ ఆఫ్
*వీక్ క్లైమాక్స్
* సెకెండ్ ఆఫ్ డైరెక్షన్
ఇవీ మొత్తం మీద సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్… ఫస్టాఫ్ బాగున్నా సెకెండ్ ఆఫ్ ని బరించే ఓపిక ఉంటే ఒకసారి సినిమాని చూడొచ్చు. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్…. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment