న్యూస్

ఫస్ట్ టైం ఇండస్ట్రీ రికార్డ్ TRP…సెకెండ్ టైం దిమ్మతిరిగే షాక్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురం లో ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టాలీవుడ్ తరుపున ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను సొంతం చేసుకుంది, ఇక సినిమా సాంగ్స్ కి యూట్యూబ్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే.

ఇక టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన మొదటి సారి టెలివిజన్ లో ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ TRP రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా మరోసారి టెలికాస్ట్ అయింది, రెండో సారి టెలికాస్ట్ ను దీపావళి కి ప్లాన్ చేసి టెలికాస్ట్ చేశారు.

కాగా రెండో సారి సినిమా ఎలాంటి రేటింగ్ ని సొంతం చేసుకుంటుంది అని అంతా ఎదురు చూస్తూ ఉండగా సినిమా రేటింగ్ అందరికీ భారీ షాక్ నే ఇచ్చింది అని చెప్పాలి. మొదటి సారి టెలికాస్ట్ టైం లో 29.4 రేటింగ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా..

రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 7.91 రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుని దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇంత తక్కువ రేటింగ్ చూసి అందరూ షాక్ అవుతూ ఉండగా సినిమా టెలికాస్ట్ టైం దీపావళి పూజ జరుపుకునే టైం లో వేయడం, లాంటివి కొంచం ఇబ్బంది పెట్టి ఉండొచ్చు అంటున్నా కూడా మరీ ఇంత తక్కువ రేటింగ్ ని మాత్రం….

ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదనే చెప్పాలి. సినిమా ఇప్పటి వరకు సాధించిన రికార్డులలో ఇదొక్కటే అనుకున్న రేంజ్ రికార్డ్ ను అందుకొక సెకెండ్ టైం టెలికాస్ట్ అయిన సినిమాల్లో తక్కువ రేటింగ్ ను సొంతం చేసుకుని షాక్ ఇచ్చిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇక ఫ్యూచర్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి మరి.

Leave a Comment