న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

ఫస్ట్ టైం TRP – 7.9… రెండో సారి TRP తెలిస్తే షాక్!!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విదేయ రామ 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర 63 కోట్లకు పైగా షేర్ ని అందుకుని దుమ్ము లేపింది. కాగా సినిమా తర్వాత చాలా ఆలస్యంగా స్టార్ మా లో టెలికాస్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పటికే సినిమా మాస్టర్ ప్రింట్ రిలీజ్ అవ్వగా…

తమిళ్ లో కూడా డబ్ వర్షన్ టెలికాస్ట్ అయిన తర్వాత తెలుగు లో చాలా లేట్ గా టెలికాస్ట్ చేయడం తో సినిమా మొదటి సారి టెలికాస్ట్ సమయం లో కేవలం 7.9 TRP రేటింగ్ మాత్రమె సొంతం చేసుకుని టెలివిజన్ లో డిసాస్టర్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది.

సినిమాను 16.5 కోట్లకు కొంటే ఫస్ట్ టైం TRP రేటింగ్ షాక్ ఇవ్వగా మళ్ళీ రీసెంట్ గా సినిమా ను మరోసారి టెలికాస్ట్ చేశారు. కాగా ఈ సారి సినిమా బెటర్ TRP రేటింగ్ తో షాక్ ఇవ్వగా సినిమా మొదటి సారి TRP రేటింగ్ కంటే కూడా కొంచం బెటర్ TRP రేటింగ్ ని సొంతం చేసుకోవడం విశేషం.

కామన్ గా కొన్ని సినిమాలు తప్పితే చాలా వరకు తొలిసారి టెలికాస్ట్ తో పోల్చితే సెకెండ్ టైం TRP రేటింగ్ తగ్గుతూ వస్తుంది. కానీ ఇప్పుడు మిగిలిన కొన్ని సినిమాల్లో ఒకటిగా నిలిచిన వినయ విదేయ రామ సినిమా సెకెండ్ టైం TRP రేటింగ్ 8.2 మార్క్ ని టచ్ చేసింది.

దాంతో చానెల్ కి మొదటి సారి షాక్ తగిలిన రెండో సారి స్టడీ TRP రేటింగ్ ని చూసి త్వరలో రెగ్యులర్ గా ఇలాంటి TRP రేటింగ్స్ ని సినిమా సొంతం చేసుకుంటే పెట్టిన పెట్టుబడి రికవరీ అవుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు. ఇక రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ చేస్తున్న విషయం తెలిసిందే.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!