న్యూస్ బాక్స్ ఆఫీస్

ఫస్ట్ డే వకీల్ సాబ్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే….!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ఇస్తున్న మూవీ వకీల్ సాబ్, మూడేళ్ళ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు మరో లెవల్ లో ఉండగా సినిమా కి భారీ రిలీజ్ అండ్ టికెట్ హైక్స్ సాలిడ్ గా కలిసి వస్తూ ఉండగా రీసెంట్ టైం లో సినిమాలు అన్నీ అంచనాలను అందుకొక పోవడం తో అందరూ వకీల్ సాబ్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు.

ఇలాంటి టైం లో సమ్మర్ కానుకగా బరిలోకి దిగుతున్న వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. ఇక మొదటి రోజు సినిమా కొన్ని ఏరియాల్లో కొన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకసారి బ్రేక్ చేయాల్సిన…

రికార్డులను గమనిస్తే… ముందుగా నైజాం ఏరియాలో ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనర్ గా సాహో సినిమా 9.41 కోట్ల షేర్ తో నిలిచింది. నాన్ పాన్ ఇండియన్ మూవీస్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా 8.67 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సీడెడ్ ఏరియాలో వినయ విదేయ రామ 7.15 కోట్ల షేర్ ని సాధించింది…ఇందులో 4.6 కోట్ల హైర్స్ ఉన్నాయి.

వర్త్ షేర్ పరంగా అరవింద సమేత 5.48 కోట్ల షేర్ ని సాధించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ డే హైయెస్ట్ షేర్ ని బాహుబలి 2 43 కోట్లతో సొంతం చేసుకోగా నాన్ బాహుబలి రికార్డ్ సైరా నరసింహా రెడ్డి 38.75 కోట్లతో సొంతం చేసుకుంది. నాన్ పాన్ ఇండియా మూవీస్ లో సరిలేరు నీకెవ్వరు 32.77 కోట్ల షేర్ తో ఉంది.

ఇక కర్ణాటక లో ఓవర్సీస్ ప్రీమియర్ షోల రికార్డులు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఔట్ ఆఫ్ రీచ్ అనే చెప్పాలి, ఇక్కడ కూడా పరిస్థితులు బాగుంటే వకీల్ సాబ్ సంచలనాలను సృష్టించి ఉండేది. ఇక సినిమా బాక్స్ అఫీస్ దగ్గర మొదటి రోజు ఎలాంటి సంచలనాలను సృష్టించి పవర్ స్టార్ కి అల్టిమేట్ కంబ్యాక్ మూవీ గా నిలుస్తుందో చూడాలి.

Leave a Comment