న్యూస్ బాక్స్ ఆఫీస్

ఫస్ట్ మహా సముద్రం, ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్…2.25 రేటింగ్ తో ఈ రాంపేజ్ ఏంటి సామి!!

బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా సెలవుల్లో రిలీజ్ అయిన మూవీస్ లో ఎంతో కొంత పాజిటివ్ బజ్ ను ముందు నుండే క్యారీ చేసిన సినిమా మహా సముద్రం, 3సార్లు 3 సినిమాలతో వచ్చినా హిట్ అందుకోలేక పోయిన అఖిల్ ఈ సారి అయినా మెప్పిస్తాడా లేదా అన్న డౌట్ నడుమ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో రాగా అసలు పండగ సెలవుల్లో ఆడుతుందో లేదో అన్న అనుమానాల నడుమ వచ్చిన సినిమా పెళ్లి సందD…

సినిమా కి మిగిలిన రెండు సినిమాల కన్నా కూడా వీక్ రివ్యూలు వచ్చినా రెండో రోజు నుండే ఏకంగా తనకన్నా డబుల్ రేంజ్ లో థియేటర్స్ ని సొంతం చేసుకున్న మహా సముద్రం సినిమా కన్నా కూడా బెటర్ గా హోల్డ్ చేస్తూ పరుగును కొనసాగించిన ఈ సినిమా వీకెండ్ తర్వాత…

థియేటర్స్ ని పెంచుకుంటూ దుమ్ము లేపింది, ఇక మొదటి వారం ఆల్ మోస్ట్ బిజినెస్ ను రికవరీ చేసిన తర్వాత మహా సముద్రం థియేటర్స్ లో 80% సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 8 వ రోజు సాధించిన కలెక్షన్స్ ఏకంగా దసరా విన్నర్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా…

లెవల్ లో సొంతం చేసుకుని డామినేట్ చేయడం స్టార్ట్ చేసింది…రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు 19 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డ్రాప్ అయిన మాస్ ఏరియాల్లో పెళ్లి సందD సినిమా సాలిడ్ గా హోల్డ్ చేసి గ్రోత్ ని చూపెట్టి షాకిచ్చింది… ముఖ్యంగా సీడెడ్ లాంటి ఏరియాలో…

అల్టిమేట్ గా ట్రెండ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు రెండో వీకెండ్ లో దసరా విన్నర్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ను డామినేట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అసలు 2-2.25 రేంజ్ రేటింగ్ తో ఈ రేంజ్ లో సంచలనం సృష్టించడం రీసెంట్ టైం లో ఈ సినిమా కే చెల్లింది అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఎంత దూరం వెళుతుందో ఈ సినిమా.

Leave a Comment