గాసిప్స్ న్యూస్

ఫస్ట్ మూవీ…బడ్జెట్ 18 కోట్లు…హైయెస్ట్ రేటు దక్కించుకున్న ఉప్పెన…కానీ!!

ఈ ఇయర్ సమ్మర్ రేసులో ఆడియన్స్ ముందు రావాల్సిన సినిమాల్లో ఉప్పెన సినిమా కూడా ఒకటి, మెగా ఫ్యామిలీ నుండి హీరో గా లాంచ్ అవుతున్న కొత్త కుర్రాడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సుకుమార్ కథ ని అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు రెండు రిలీజ్ అయ్యి అద్బుతమైన రెస్పాన్స్ ని ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది.

నీ కళ్ళు నీలి సముద్రం అయితే 100 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుని సినిమా కి సాలిడ్ క్రేజ్ ని తెచ్చి పెట్టింది. కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటె ఎప్పుడో రిలీజ్ అయ్యి పరుగు పూర్తి అవ్వాల్సిన ఈ సినిమా మిగిలిన సినిమాలతో పాటు నిరవధికంగా ఆగిపోగా..

సినిమా ను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయాలనీ కొన్ని యాప్స్ తెగ కష్టపడుతున్నాయి. సినిమా బడ్జెట్ సుమారు గా 18 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా కి డిజిటల్ రిలీజ్ ఆఫర్లు 16 కోట్ల రేంజ్ లో వస్తుండగా యూనిట్ వాటికి నో చెబుతూ వస్తుంది. కాగా లేటెస్ట్ గా ఇప్పుడు…

సినిమా కి లీడింగ్ స్ట్రీమింగ్ యాప్ ఒకటి ఏకంగా 19-20 కోట్ల రేంజ్ డీల్ కి మేం సిద్ధమే అంటూ సంకేతాలు ఇస్తుందని ట్రేడ్ లో టాక్ ఉంది. ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉండగా లాంచ్ మూవీ అయినా కానీ ఈ రేంజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సొంతం అవ్వడం కష్టమే అని చెప్పాలి.

అది కూడా ప్రస్తుత పరిస్థితులు ఇంకా సెట్ కాకపోవడం తో మరింత డిలే అయితే సినిమా క్రేజ్ మరింత తగ్గే ఛాన్స్ ఉన్నప్పటికీ సినిమా కి ఇంత మంచి రేటు ఆఫర్ వచ్చినప్పటికీ కూడా లేట్ అయినా కానీ కొత్త హీరో లాంచ్ మూవీ అవ్వడం తో లాభ నష్టాలు చూసుకోకుండా థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నారట నిర్మాతలు.

Leave a Comment