గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

ఫస్ట్ సినిమా డిసాస్టర్…ఆకాష్ పూరీ “రొమాంటిక్” కి సాలిడ్ OTT ఆఫర్!!

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలతో మెప్పించగా హీరోగా ఆంధ్రాపోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అప్పుడు కూడా టీనేజ్ స్టార్ గానే జనాలు చూశారు, ఫుల్ లెంత్ హీరోగా 2018 లో మెహబూబా సినిమా తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆకాష్ పూరీ ఆ సినిమా తో కొంతవరకు మెప్పించాలని ట్రై చేసినా కానీ.. కథలో సత్తా లేకపోవడం తో…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా భారీ ఫ్లాఫ్ గా మిగిలి పోయింది, ఇలాంటి టైం లో కొంత టైం తీసుకుని తన రెండో సినిమా ను మరింత బాగా ప్లాన్ చేసుకున్న ఆకాష్ పూరీ రొమాంటిక్ అనే లవ్ స్టొరీ తో ఆడియన్స్ ముందుకు రావడానికి ట్రై చేస్తుండగా పూరీ జగన్నాథ్…

ఈ సినిమా ను నిర్మిస్తుండగా రమ్యకృష్ణ తో పాటు మరింత మంది స్టార్ కాస్ట్ ఈ సినిమా లో నటించారు, కాగా ఇప్పటి వరకు పోస్టర్ లు, సాంగ్స్ తో మెప్పించిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తీ చేసుకోగా థియేటర్స్ లో రిలీజ్ కి ట్రై చేసినా కానీ..

జనాలు వస్తారో రారో అన్న డౌట్ లో ఉన్న టైం ఈ సినిమా కి డైరెక్ట్ రిలీజ్ కి సాలిడ్ ఆఫర్ వచ్చింది అని అంటున్నారు. సినిమా బడ్జెట్ లెక్కలు ఇంకా రివీల్ అవ్వాల్సి ఉన్నా కానీ డైరెక్ట్ రిలీజ్ కోసం భారీ OTT యాప్ ఈ సినిమా కి 11 కోట్ల రేంజ్ రేటు ని ఇచ్చింది అని అంటున్నారు.

బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ కూడా ఆ రేంజ్ లో ఉండటం కష్టమే అయిన నేపధ్యంలో టీం ఇప్పుడు డైరెక్ట్ రిలీజ్ కి మొగ్గు చూపుతున్నారు అన్నది లేటెస్ట్ టాక్ గా చెప్పొచ్చు. త్వరలోనే ఈ సినిమా పై అఫీషియల్ నిర్ణయం వెలువడే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు ఇప్పుడు.

Leave a Comment