న్యూస్ బాక్స్ ఆఫీస్

ఫైనల్ గా 4 సినిమాల్లో ఏది బెస్ట్…వీకెండ్ విన్నర్ ఏది?

సంక్రాంతి వీకెండ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకే టైం లో నోటబుల్ మూవీస్ ఎక్కువగా రిలీజ్ అయింది ఫిబ్రవరి 19 వీకెండ్ అనే చెప్పాలి. ఏకంగా 4 సినిమాను బాక్స్ ఆఫీస్ బరిలో నిలవగా రెండు స్ట్రైట్ అండ్ 2 డబ్ మూవీస్ రేసులో ఉండగా వేటికవే డిఫెరెంట్ జానర్ లో రూపొందిన ఈ మూవీస్ లో వీకెండ్ విన్నర్ గా మొత్తం మీద ఏ సినిమా నిలిచింది అన్నది ఆసక్తిగా మారింది అని చెప్పాలి…

ముందుగా కపటధారి విషయానికి వస్తే ఈ సినిమా కన్నడ సూపర్ హిట్ రీమేక్ అయినా తెలుగు లో డీసెంట్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా పూర్తీ గా నిరాశ పరిచిన ఈ సినిమా కంప్లీట్ గా రేసు నుండి తొలగిపోయింది. ఇక చక్ర సినిమా విశాల్ ఇది వరకు నటించిన….

అభిమన్యుడు సినిమా తరహా నేపధ్యంతో తెరకేక్కినా కానీ ఆ సినిమా లో సగం వరకు మాత్రమే అంచనాలను అందుకుంది. కానీ రీసెంట్ విశాల్ మూవీస్ కన్నా కూడా బెటర్ అనే చెప్పాలి…. ఇక కన్నడ డబ్ మూవీ పొగరు సినిమా ఒకటి నిరూపించింది… మాస్ సెంటర్స్ లో ఇప్పటికీ అరిగిపోయిన…

మాస్ ఫార్ములా మూవీస్ ఇప్పుడు వచ్చినా కానీ కలెక్షన్స్ జనరేట్ చేస్తాయి అని నిరూపించింది ఈ సినిమా… డబ్ మూవీనే అయినా హీరో ఎవరో తెలియకున్నా సాంగ్స్ వలన సినిమా కి ఓపెనింగ్స్ లభించాయి కానీ కథ పరంగా సినిమా పూర్తిగా నిరాశ పరిచిన సినిమాగా చెప్పుకోవాలి. ఇక ఫైనల్ గా చాలా ఏళ్ళుగా ఫ్లాఫ్స్ లో ఉన్న అల్లరి నరేష్ నాంది సినిమా పెద్దగా అంచనాలు లేకుండా పూర్ ఓపెనింగ్స్ తో రిలీజ్ అయినా…

బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తో రోజు రోజుకి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ దూసుకు పోతుంది… అల్లరి నరేష్ కి చాల కాలానికి కంబ్యాక్ మూవీ గా నిలిచింది ఈ సినిమా… ఈ వీక్ వచ్చిన మూవీస్ బెస్ట్ టాక్ తో పాటు కలెక్షన్స్ పరంగా మంచి ట్రెండ్ ను సొంతం చేసుకుని దూసుకు పోతున్న ఈ సినిమా నే ఈ వీకెండ్ విన్నర్ గా చెప్పొచ్చు….

Leave a Comment