న్యూస్ రివ్యూ

ఫోరెన్సిక్ మూవీ రివ్యూ….కుమ్మింది సినిమా!!

   ఈ మధ్య సైకో థ్రిల్లర్ జానర్ లో సినిమాలు రావడం ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే, తెలుగు లో రాక్షసుడు సినిమా సూపర్ హిట్ అవ్వగా మిగిలిన ఇండస్ట్రీలలో కూడా ఇలాంటి సైకో థ్రిల్లర్ మూవీస్ పాపులర్ అవుతున్నాయి. మలయాళంలో ఈ ఇయర్ వచ్చిన ఫోరెన్సిక్ అనే సినిమా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుని సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు లో మంచి రీమేక్ మెటీరియల్ అనుకుంటే ఆహా వీడియో వాళ్ళు….

ఈ సినిమాను తెలుగు లో డబ్ చేసి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేశారు. టొవినో థామస్ లీడ్ రోల్ లో మమతా మోహన్ దాస్ కీలక రోల్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా తెలుగు లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకోగా సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..

కథలోకి వెళితే… ఓపెనింగ్ సీన్ లోనే చికెన్ షాప్ లో కోడి ని కోసి ఒక డబ్బాలో వేయడం చూసి ఎక్సైట్ అయిన ఓ కుర్రాడు తర్వాత కోడి తలలను కప్పలను ఒక్కో సీసాలో బందిస్తాడు. అది చూసిన తండ్రి అ కుర్రాడిని చితకబాదుతాడు. కట్ చేస్తే.. కొన్నేలకి…

సిటీలో చిన్నపిల్లలు కనబడకుండా పోతారు, తర్వాత వాళ్ళు చనిపోతారు, ఇవన్నీ ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి పోలిస్ ఆఫీసర్ అయిన మమతా మోహన్ దాస్ కి ఫోరెన్సిక్ ఆఫీసర్ అయిన హీరో కలిసి వర్క్ చేయాల్సి వస్తుంది. అసలు ఆ సైకో ఎవరు… ఆ కుర్రాడేనే లేక వేరే ఎవరైనా ఉన్నారా లాంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సైకో థ్రిల్లర్ మూవీస్ లో ఆసక్తి రేపే స్క్రీన్ ప్లే ఎంత ముఖ్యమో మెయిన్ విలన్ ఫ్లాష్ బ్యాక్ కూడా అంతే ముఖ్యం అని చెప్పాలి. సైకో ఫ్లాష్ బ్యాక్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటె సినిమా పై ఇంప్రెషన్ అంత పెరుగుతుంది. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ వరకు ఉత్కంట పీక్స్ లో ఉంటుంది.

కానీ ఒక్క సారి క్లైమాక్స్ మొదలయ్యాక విలన్ ఏంటి ఇందుకోసమే చంపుతున్నాడా అంటూ కొంచం నీరుగారిపోతాం. ఆ క్లైమాక్స్ ఒక్కటి ఈ సినిమా కి డ్రా బ్యాక్. కానీ సినిమా మొత్తం కూడా రాక్షసుడు సినిమా చూస్తున్నప్పుడు ఇచ్చినంత కిక్ ఇవ్వడం మాత్రం ఖాయమని చెప్పాలి.

స్టార్ కాస్ట్ పెర్ఫార్మెన్స్, సినిమాలో వచ్చే ట్విస్ట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, బ్యాగ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే ఎడిటింగ్ అన్నీ కూడా పెర్ఫెక్ట్ గా సెట్ అయిన సినిమా ఇది, తెలుగు డబ్బింగ్ కొందరికి అంత బాగా సెట్ కాకున్నా కానీ చూస్తున్న ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు.

విలన్ ఒక్కో సారి ఒక్కొక్కరిగా అనిపిస్తూ, ఆడియన్స్ ని ప్రీ క్లైమాక్స్ వరకు ఎవరు…ఎవరు అంటూ గెస్ చేసేలా చేయిస్తుంది, క్లైమాక్స్ లో విలన్ ఫ్లాష్ బ్యాక్ పవర్ ఫుల్ లేక పోవడం ఎండింగ్ కూడా చాలా సింపుల్ గా చెప్పేయడం ఒక్కటి డ్రా బ్యాక్ గా చెప్పొచ్చు…

క్లైమాక్స్ ని పక్కకు పెడితే మిగిలిన సినిమా మొత్తం ఆడియన్స్ ని ఓ రేంజ్ లో కిక్ ఇచ్చే మూవీ అని చెప్పొచ్చు. సైకో థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఓ రేంజ్ లో నచ్చే సినిమా ఇది, కమర్షియల్ మూవీస్ చూసే వారిని కూడా సినిమా చాలా వరకు మెప్పించడం ఖాయం….సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్…

Leave a Comment