న్యూస్ బాక్స్ ఆఫీస్

ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్….కానీ ఇది తప్పదు ఇక!!

అజ్ఞాతవాసి సినిమా తర్వాత టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 3 ఏళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ పింక్ మూవీ కి రీమేక్ గానే తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఎక్స్ టెండెడ్ క్యామియోనే అయినా కానీ ఒక మెయిన్ స్ట్రీం మూవీలా చూస్తూ విపరీతమైన హైప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు.. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో…

మరి కొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రిలీజ్ కి ముందు ఇప్పుడు సినిమా కి అనుకోని అవరోధాలు ఎదురు అవుతున్నాయి. కర్ణాటక లో కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ కి ఈ సినిమా అక్కడ ఇప్పుడు 50% ఆక్యుపెన్సీతో రిలీజ్ కానుంది.

రీసెంట్ గా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూ వస్తుండటంతో అక్కడ థియేటర్స్ లో 50% ఆక్యుపెన్సీ నే పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. దాంతో అక్కడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లేటెస్ట్ మూవీ యువరత్న కి రెండో రోజు నుండే ఈ సెగ తగిలింది.

ఇక తెలుగు రాష్ట్రాలలో రోజుకి ఎన్ని షోలు అయినా వేసుకునే వెసులుబాటు ఇవ్వగా ఇప్పుడు 5 షోలు మిడ్ నైట్ షోలు వేసుకోవాలని ప్లాన్ చేసినా ఇక్కడ కూడా కేసులు పెరుగుతూ వస్తుండటంతో వాటికి పర్మీషన్ అయితే ఇవ్వలేదు. ఇక ఇక్కడ కూడా కేసులు పెరిగితే… వెంటనే ఇక్కడ థియేటర్స్ లో కూడా 50% ఆక్యుపెన్సీతో రన్ చేయాలనీ రూల్ పెట్టె అవకాశం ఉందని అంటున్నారు.

ఎటొచ్చి ఇప్పుడు రిలీజ్ కి ఈ సినిమాకి అవరోధాలు ఎదురు అవుతూ ఉండటం తో కలెక్షన్స్ పరంగా ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది..  మరి ఇన్ని అవరోధాలను దాటి పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఎలాంటి సంచలనాలను నమోదు చేసి పవన్ కళ్యాణ్ కి కంబ్యాక్ మూవీగా నిలుస్తుందో చూడాలి.

Leave a Comment