గాసిప్స్ న్యూస్

ఫ్లాపుల్లో ఉన్నా ఇంత రేటా…మా వల్ల కాదంటున్న టాలీవుడ్ నిర్మాతలు!!

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే… హిట్స్ కి ఫ్లాఫ్స్ కి అతీతంగా అల్టిమేట్ క్రేజ్ ను ఏళ్ల నుండి క్యారీ చేస్తున్న సూపర్ స్టార్ తెలుగు లాస్ట్ 15 ఏళ్లలో శివాజీ, రోబో మరియి 2.0 సినిమాలతో తప్పితే మిగిలిన సినిమాలు అన్నీ కూడా నిరాశనే మిగిలిస్తూ వచ్చాయి…. అయినా కానీ రజినీ సినిమా అంటే ఇక్కడ భారీ రేట్లు పెట్టి కొనడానికి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు నిర్మాతలు బయ్యర్లు…

కానీ కబాలి డిసాస్టర్ తర్వాత రజినీ మార్కెట్ చాలా వరకు డౌన్ అయింది… 2.0 తప్పితే చేసిన మిగిలిన సినిమాలు అన్నీ కూడా నిరాశనే మిగిలించాయి, రజినీ లాస్ట్ మూవీ దర్బార్ తెలుగు లో 14 కోట్ల బిజినెస్ కి 10 కోట్ల షేర్ ని అందుకుని ఫ్లాఫ్ అయ్యింది…

ఇలాంటి టైం లో విశ్వాసం డైరెక్టర్ శివ డైరక్షన్ లో రజినీ చేస్తున్న కొత్త సినిమా అన్నాట్టే ఇప్పుడు దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా తెలుగు బిజినెస్ కోట్స్ ని ఓపెన్ చేశారట మేకర్స్… తెలుగు లో సినిమా మినిమం బిజినెస్ ఆఫర్స్ కి భారీ రేటు చెబుతున్నారట.

ఏకంగా 15 కోట్ల దాకా రేటుని మొదలు పెట్టాలని భావిస్తున్నారు వాళ్ళు, కానీ ప్రస్తుతం తెలుగు లో పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే, టికెట్ రేట్ ఇష్యూ ఇంకా సెట్ కాలేదు, తెలుగు పెద్ద సినిమాలే ఏం చేయలేని పరిస్థితిలో ఉండగా డబ్బింగ్ మూవీ కి అది కూడా ప్రస్తుతం రజినీ తెలుగు ఫామ్ దృశ్యా ఆ రేటు అస్సలు ఇవ్వలేమని ఇక్కడ నిర్మాతలు…

సినిమా మేకర్స్ కి చెబుతున్నారట. దాంతో ఇంకా రైట్స్ అమ్ముడు పోలేదని లేటెస్ట్ గా ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది. ఒక్క లవ్ స్టొరీ తప్పితే మిగిలిన ఏ సినిమా కూడా తెలుగు లో 15 కోట్ల మార్క్ కాదు కాదా 12 కోట్ల ని కూడా అందుకోలేదు. అలాంటిది డబ్బింగ్ మూవీ కి 15 కోట్ల బిజినెస్ ఇప్పుడు పెట్టడం తలకిమించిన భారమే. మరి సినిమా మేకర్స్ రేటు ఏమైనా తగ్గిస్తారో చూడాలి అని ఇక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నారట.

Leave a Comment