టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

ఫ్లాఫ్ హీరో మీద 150 కోట్లు పెడితే…లాస్ ఎంత వచ్చిందో తెలిస్తే మైండ్ బ్లాంక్!!

బాహుబలి ని చూసి అలాంటి భారీ సినిమాలు చేయాలి అని అన్ని ఇండస్ట్రీలు ఎంత కష్ట పడ్డా కానీ ఎ ఇండస్ట్రీ కూడా ఇప్పటి వరకు బాహుబలి ని మరిపించే సినిమా తీయలేక పోయింది, ఇక ఇండియా లో నంబర్ 1 ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ అయితే శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది కానీ ఇప్పటి వరకు సంజయ్ లీలా భన్సాలీ తప్పితే మరే డైరెక్టర్ హిస్టారికల్ జానర్ లో అంచనాలను అందుకోలేక పోతున్నారు. 2019 లో ఇలాంటి హిస్టారికల్ నేపధ్యంలో వచ్చిన…

సినిమా లు చాలానే ఉండగా అందులో ఆల్ మోస్ట్ 150 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిన సినిమా పానిపత్ కూడా ఒకటి, యంగ్ హీరోల్లో నటుడిగా తీవ్ర విమర్శలు ఎదురుకున్న హీరో అర్జున్ కపూర్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఫ్లాఫ్ హీరోనే అన్న అపవాదుని సొంతం చేసుకోగా… కృతి సనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ను…

జోదా అక్బర్, లగాన్ ఫేమ్ అశుతోష్ గోవారికర్ డైరెక్ట్ చేయడం తో బడ్జెట్ పెరిగి పెరిగి 150 కోట్ల దాకా వెళ్ళింది. సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కానీ బిజినెస్ 50 కోట్ల రేంజ్ లో జరగగా 95 కోట్ల నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇండియా లో మొత్తం మీద…

పరుగు పూర్తీ అయ్యే టైం కి పానిపత్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 35 కోట్ల నెట్ కలెక్షన్స్ ని మాత్రమె సాధించింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పానిపత్ సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలు మరింత షాకింగ్ అనే చెప్పాలి. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 51 కోట్ల గ్రాస్ ని 26 కోట్ల షేర్ ని మాత్రమె అందుకున్న ఈ పానిపత్ సినిమా అత్యంత భారీ ఫ్లాఫ్స్ లో ఒకటిగా చేరింది.

సినిమా బడ్జెట్ పరంగా చూసుకున్నా 150 కొట్లలో బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 26 కోట్లు మాత్రమె రికవరీ చేసిన ఈ సినిమా ఏకంగా 124 కోట్ల రేంజ్ లో లాస్ ని బడ్జెట్ పరంగా సొంతం చేసుకుంది, దాంతో బడ్జెట్ పరంగా బిగ్గెస్ట్ లాస్ లను సొంతం చేసుకుంటూ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో ఒకటిగా చేరింది ఈ సినిమా… అప్పటి నుండి అర్జున్ కపూర్ నుండి కొత్త సినిమా ఏది ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు…

Leave a Comment