న్యూస్ రివ్యూ

బంగారు బుల్లోడు రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!

ఒకప్పుడు కామెడీ సినిమాలతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఒక వెలుగు వెలిగిన అల్లరి నరేష్ ఇయర్ కి మూడు నాలుగు సినిమాలతో సందడి చేసేవాడు, కానీ సుడిగాడు సినిమా విజయం తర్వాత తన సినిమాల మీద అంచనాలు పెరగడం అవి అందుకునేలా సినిమాలు పడక పోవడం తో కెరీర్ పూర్తిగా డౌన్ ఫాల్ అయింది, లాస్ట్ టైం మహర్షి లో ఫ్రెండ్ రోల్ చేసిన అల్లరి నరేష్ ఇప్పుడు బంగారు బుల్లోడు అంటూ…

ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఎంతవరకు ఆకట్టుకున్నాడు, సినిమా ఎలా ఉంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ.. ముందుగా కథ పాయింట్ కి వస్తే… అల్లరి నరేష్ ఒక గ్రామీణ బ్యాంక్ లో…

గోల్డ్ లోన్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తూ ఉంటాడు, తనకి తన అన్నలకి పెళ్లి అస్సలు సెట్ కాదు, దానికి కారణం తన తాత తనికెళ్ళ భరణి చేసిన ఒక తప్పు వలన… ఇంతకీ ఆ తప్పు ఏంటి, ఆ తప్పుకి నగలకి లింక్ ఏంటి, ఆ తప్పు గురించి తెలుసుకున్నాక అల్లరి నరేష్ చేసిన పరిహారం ఏంటి…

దాని వలన ఎదురైనా ఇబ్బందులు ఏంటి లాంటివి అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథ పరంగా కొంచం మంచి పాయింట్ ఉన్న కథ దొరికింది కానీ దాన్ని డైరెక్టర్ ఏమాత్రం డీల్ చేయలేక పోయాడు. కావలసినంత కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ తో పాటు పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న కాన్సెప్ట్ ఈ సినిమా కానీ డైరెక్టర్ దేనికి పూర్తీ న్యాయం చేయలేక పోయాడు. ఇలాంటి సినిమాలో…

ఉన్నంతలో అల్లరి నరేష్ తనవరకు తానూ ఎదో మెప్పించే ప్రయత్నం చేశాడు కానీ కామెడీ సీన్స్ పడలేదు, ఎమోషనల్ సీన్స్ బాగా చేసినా అవి కనెక్ట్ అవ్వలేదు. అల్లరి నరేష్ సినిమా అంటే కామెడీ ఎంటర్ టైనర్ అనే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు, కామెడీ తో మెప్పించడం మానేసి…

ఎమోషనల్ సీన్స్ బోరింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా మొత్తం సాగదీశారు…దాంతో ఏ దశలో కూడా అల్లరి నరేష్ కంబ్యాక్ మూవీ లా బంగారు బుల్లోడు సినిమా అనిపించలేదు.. ముందే చెప్పినట్లు అల్లరి నరేష్ కామెడీ చాలా తక్కువ చేసి పెర్ఫార్మెన్స్ పరంగా కొద్దిగా మెప్పించాడు, హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించే విధంగా వెన్నెల కిషోర్ కామెడీ 2 చోట్ల బాగానే ఉంది.

ఇక పోసాని కృష్ణమురళి, జబర్దస్త్ శీను ల కామెడీ ఏమాత్రం నవ్వు తెప్పించలేక పోయింది, సాంగ్స్ ఒకటి రెండు పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ యావరేజ్, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా నీరసం తెప్పించే విధంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించాగా…

డైరెక్షన్ పరంగా పి. గిరి కథ పాయింట్ మంచిదే అనుకున్నా తెరకెక్కించే విధానం పూర్తిగా నిరాశ పరిచింది, పడుతూ లేస్తూ సాగిన ఫస్ట్ ఆఫ్ సెకెండ్ ఆఫ్ కన్నా బెటర్ గా అనిపించింది. మొత్తం మీద ఇది అల్లరి నరేష్ నుండి ఎక్స్ పెర్ట్ చేసిన కంబ్యాక్ మూవీ కాదని 20 నిమిషాలకే తెలిసి పోయేలా చేసింది.

మొత్తం మీద సినిమాలో కథ పాయింట్, ఇంటర్వెల్ ట్విస్ట్, తనికెళ్ళ భరణి కీలక సన్నివేశాలలో పెర్ఫార్మెన్స్ బాగుండగా, మిగిలినవన్నీ లోపాలే అని చెప్పాలి. రొటీన్ మూవీస్ చూసేవారు టైం పాస్ చేద్దామని ట్రై చేసినా కష్టంగా ముగించాల్సి వస్తుంది సినిమా.. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2 స్టార్స్

Leave a Comment