న్యూస్ బాక్స్ ఆఫీస్

బంగారు బుల్లోడు 1st డే కలెక్షన్స్…ఏంటి సామి ఈ షాక్!!

సడెన్ స్టార్ అల్లరి నరేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన జోరు చూపి చాలా కాలమే అవుతుంది, సుడిగాడు సినిమా తో తన పవర్ చూపినా తర్వాత కంప్లీట్ గా మార్కెట్ ని కోల్పోయిన అల్లరి నరేష్ నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటికి మించి అలరించలేక బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరుస్తూ వస్తున్నాయి. ఇలాంటి టైం లో ఎప్పటి నుండో రిలీజ్ కి నోచుకోకుండా ఆగిపోతున్న…

బంగారు బుల్లోడు సినిమా ఎట్టకేలకు రీసెంట్ గా రిలీజ్ ను కన్ఫాం చేసుకుని ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలలో 420 వరకు థియేటర్స్ ని కేటాయించారు… దాంతో ఓపెనింగ్స్ బాగా వస్తాయి అనుకున్నా కానీ సినిమా షాక్ ఇస్తూ..

ఏమాత్రం ఇంపాక్ట్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపలేక పోయింది, దానికి తోడూ ఈ సినిమా కి కూడా టికెట్ హైక్స్ పెట్టారు, పండగ టైం లో అంటే జనాలు ఈ రేటు పెట్టినా వచ్చి చూసేవాల్లెమో కానీ పండగ అయిపోయాక నార్మల్ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాకి టికెట్ హైక్స్….

అది కూడా మార్కెట్ పూర్తిగా డల్ అయిన అల్లరి నరేష్ కి పెట్టడం కూడా ఇబ్బంది పెట్టింది.. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత లేవు, థియేటర్స్ దగ్గర కూడా జనాలు పెద్దగా లేరు, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ ఇప్పుడు నిరాశ పరిచే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. సినిమా ఇప్పుడు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 35 లక్షల నుండి 40 లక్షల రేంజ్ లో…

షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని చోట్లా అంచనాలను మించి బాగుంటే 40 నుండి 50 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. 3.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమాకి ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. మరి అఫీషియల్ గా సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇక…

Leave a Comment