న్యూస్ బాక్స్ ఆఫీస్

బందోబస్త్ డే 1 ఓపెనింగ్స్….షాకింగ్ ఓపెనింగ్స్!!

ఒకప్పుడు కోలివుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే తెలుగు రాష్ట్రాలలో ఓ రేంజ్ లో హడావుడి ఉండేది, స్టార్ హీరోల రేంజ్ లో ఓపెనింగ్స్ ఉండేవి, కానీ సరైన సినిమాలను ఎంచు కోవడం లో ఈ మధ్య విఫలం అవుతున్న సూర్య వరుసగా ఫ్లాఫ్ సినిమాలతో తెలుగు లో కూడా తన మార్కెట్ ని కోల్పోయాడు. ఇలాంటి టైం లో వచ్చిన లేటెస్ట్ మూవీ బందోబస్త్ తెలుగు లో టాక్ బాగానే వచ్చింది.

కానీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కానీ థియేటర్స్ దగ్గర టికెట్ సేల్స్ కాని తొలి 2 షోలకు అనుకున్న రేంజ్ లో అయితే లేవనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేక పోవడం తో మౌత్ టాక్ పైనే డిపెండ్ అయిన సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో…

మొత్తం మీద తొలి రెండు షోలకు 20% వరకు ఆక్యుపెన్సీ ని మాత్రమె సొంతం చేసుకుంది, అది కూడా ఆన్ లైన్ టికెట్ సేల్స్ అండ్ క్లాస్ సెంటర్స్ లో ఓపెనింగ్స్ హెల్ప్ తో సాధ్యం అయింది, మాస్ సెంటర్స్ లో సినిమా కి వాల్మీకి (గద్దల కొండ గణేష్) నుండి పోటి తీవ్రంగా ఉండటం తో పోటి ఇవ్వలేక పోయింది.

కానీ సినిమా టాక్ బాగుండటం తో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి సినిమా గ్రోత్ ని అందుకునే అవకాశం ఉంది, ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి చూస్తుంటే సినిమా 1.5 కోట్ల లోపు షేర్ ని అందుకోవచ్చు. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో…

గ్రోత్ సాధించి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అనుకున్న రేంజ్ లో ఉంటె సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.7 కోట్ల నుండి 2 కోట్ల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉంది, మరి రోజు ముగిసే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!