న్యూస్ బాక్స్ ఆఫీస్

బందోబస్త్ ఫస్ట్ డే కలెక్షన్స్…..షాకింగ్ కలెక్షన్స్!!

కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ బందోబస్త్, తమిళ్ తెలుగు భాషల్లో ఈ రోజు భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా నిరాశనే మిగిలించింది, సినిమా టాక్ సూర్య నటించిన రీసెంట్ మూవీస్ కన్నా బెటర్ గానే ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా కి పోటిగా వరుణ్ తేజ్ వాల్మీకి (గద్దల కొండ గణేష్) ఉండటం తో మాస్ సెంటర్స్ లో పోటి ఇవ్వలేక పోయింది.

క్లాస్ సెంటర్స్ లో జస్ట్ ఒకే అనిపించుకున్న సినిమా మొత్తం మీద మొదటి రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 20% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి మొత్తం మీద 28% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అయినట్లు సమచారం.

దాంతో సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ నైట్ షో ల లెక్కలు తేలాల్సి ఉండటం తో ఫైనల్ లెక్కలు గ్రోత్ ని సాధిస్తే మొదటి రోజు 1.9 కోట్ల నుండి 2 కోట్ల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్పాలి.

ఇక తమిళనాడు లో సినిమా స్లో గానే మొదలు అవ్వగా మొదటి రోజు మొత్తం మీద 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా టోటల్ బిజినెస్ 54 కోట్ల రేంజ్ లో జరిగింది 100 కోట్ల గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా…

వీకెండ్ మొత్తం సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ ని రికవరీ చేయగలుగుతుంది. టాక్ ఎలాగు బెటర్ గానే ఉండటం తో కచ్చితంగా సినిమా గ్రోత్ ని సాధించే అవకాశం వీకెండ్ లో ఉందని చెప్పొచ్చు. మరి మొదటి రోజు కి గాను అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సినిమా సాధిస్తుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!