గాసిప్స్ న్యూస్

బన్నీ-మహేష్ చేయాల్సినలో అఖిల్!!

ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం కామనే… ఇలా చాలా సినిమాలు టాలీవుడ్ లో ఒక హీరో నుండి మరో హీరో కి చేతులు మారాయి. మరో మహేష్ లేదా అల్లు అర్జున్ చేయాల్సిన ఒక సినిమా తిరిగి తిరిగి ఇప్పుడు అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని చెంతకు వచ్చి ఆగిందని ఇండస్ట్రీ లో టాక్ గట్టిగానే వినిపిస్తుంది, వివరాల్లోకి వెళితే… కెరీర్ మొదలు పెట్టి 5 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ…

నికార్సయిన హిట్ కొట్టని అఖిల్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలో తెలియక తికమక పడుతున్నాడు. ప్రస్తుతం ట్రెండ్ చూసి లవ్ అండ్ ఫ్యామిలీ స్టొరీ పెర్ఫెక్ట్ గా కనెక్ట్ అయితే మంచి విజయం కొట్టొచ్చు అని భావించి బొమ్మరిల్లు ఫేం భాస్కర్ తో సినిమా చేస్తున్నాడు అఖిల్.

కాగా ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఓన్ బ్యానర్ లో మరో క్రేజీ డైరెక్టర్ తో సినిమా ఆల్ మోస్ట్ కమిట్ అయినట్లే అన్న టాక్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, ఆ డైరెక్టర్ మరెవరో కాదు గీత గోవిందం సినిమా తో సంచలన విజయం అందుకుని 70 కోట్లు షేర్ అందుకున్న పరశురం…

ఆ సినిమా వచ్చి ఏడాదికి పైగానే టైం అయినా ఈ డైరెక్టర్ టాప్ స్టార్స్ తో చేయాలి అని కథ ప్రిపేర్ చేయగా ముందుగా మహేష్ తో ఆ మూవీ అనుకున్నా ఎందుకనో ఫైనలైజ్ కాలేదు, తర్వాత గీత గోవిందం ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ని కలిసి అల్లు అర్జున్ కి తగ్గట్లు అందులో మార్పులు చేయగా…

అల్లు అర్జున్ పూర్తీ మార్కులు వేయలేదు… దాంతో ఆ కథ కి మరిన్ని మెరుగులు దిద్ది అఖిల్ చెంతకు తీసుకు వెళ్ళగా అఖిల్ అలాగే నాగార్జున ఓకే చెప్పారని టాక్ ఇండస్ట్రీ లో ఉంది. అఖిల్ ప్రజెంట్ మూవీ అయిన తర్వాత ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం ఆవుతుందో తెలియాల్సి ఉంది…

Leave a Comment