న్యూస్

బాక్స్ ఆఫీస్ డిసాస్టర్…అమ్మింది 7 కోట్లు…TRP వచ్చింది ఇది!

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్, బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఈ ఇయర్ ఫిబ్రవరి టైం లో రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ సినిమా సాధించిన భారీ బిజినెస్ వలన ఎంతో కొంత కలెక్షన్స్ ని సాధిస్తుంది అనుకుంటే సినిమా భారీ నష్టాలను సొంతం చేసుకుని….

బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును కంప్లీట్ చేసుకుంది… సినిమా మొత్తం మీద 31.2 కోట్ల టార్గెట్ కి కేవలం 10 కోట్ల లోపు షేర్ ని మాత్రమే వసూల్ చేసి భారీ నష్టాలను మిగిలించగా ఈ సినిమా ను అప్పటికే జెమినీ టీవీ కి భారీ రేటు కి శాటిలైట్ రైట్స్ ని అమ్మారు.

సినిమా ను ఏకంగా 7 కోట్ల రేంజ్ రేటు కి శాటిలైట్ రైట్స్ ని అమ్మగా జెమినీ టీవీ సినిమా ను రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేసింది, కాగా సినిమా కు ఎలాంటి TRP రేటింగ్ వస్తుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ వలన సినిమా…

మహా అయితే 4 నుండి 5 రేంజ్ రేటింగ్ ని సొంతం చేసుకోవచ్చు అని అంతా అనుకున్నారు. కానీ సినిమా ఆ లెక్క ని మించి ఓవరాల్ గా మొదటి సారి టెలికాస్ట్ అయిన టైం లో 5.82 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించే రిజల్ట్ ని టెలివిజన్ లో మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు సొంతం చేసుకుంది.

సినిమా ను కొన్న రేటు ప్రకారం చూసుకుంటే ఇది కూడా నిరాశ పరిచే రేటింగ్ అయినా కానీ సినిమా కి ఓవరాల్ గా దక్కిన ఎక్స్ ట్రీమ్ నెగటివ్ రేటింగ్ అండ్ ఫీడ్ బ్యాక్ కి ఇది పర్వాలేదు అనిపించే TRP అనే చెప్పాలి, కానీ ఛానెల్ కి ప్రాఫిట్ రావాలి అంటే సినిమా మరింత కష్టపడాల్సి ఉంటుంది.

Leave a Comment