న్యూస్

బాక్ టు బాక్ డిసాస్టర్లు….బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో నితిన్ సినిమా!

యూత్ స్టార్ నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి మళ్ళీ కొంత కాలం అవుతుంది, వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో లాస్ట్ ఇయర్ భీష్మ సినిమా తో కెరీర్ లో మళ్ళీ సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న నితిన్ ఆ సినిమా తర్వాత వెంటనే బాక్ టు బాక్ రెండు ఫ్లాఫ్స్ ను తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. రెండు సినిమాలు డిలే అవుతూ ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు….

ఒకే నెల గ్యాప్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి. ముందు చెక్ సినిమా తో ఆడియన్స్ ముందుకు వచ్చి అంచనాలను అందుకోలేక పోయిన నితిన్ తర్వాత మంచి అంచనాలను పెట్టుకున్న రంగ్ దే సినిమా కూడా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకనో అంచనాలను టార్గెట్ ను అందుకోలేక నష్టాలను గట్టిగానే మిగిలించింది, దాంతో బాక్ టు బాక్ రెండు ఫ్లాఫ్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకున్న నితిన్ ఇప్పుడు అంధ ధూన్ రీమేక్ మేస్ట్రో మీద హోప్స్ ఎక్కువగా పెట్టుకున్నా కమర్షియల్ కంబ్యాక్ కోసం…

ఎదురు చూస్తున్నాడు అని చెప్పొచ్చు. ఇలాంటి టైం లో తను ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ కొడుముల డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్దం అయ్యాడు అన్నది లేటెస్ట్ గా టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తున్న టాక్ అని చెప్పాలి. భీష్మ సినిమా తర్వాత కొత్త సినిమా ను కమిట్ అవ్వలేదు వెంకీ…

కొన్ని ప్రాజెక్ట్ లు అనుకున్నా ఎందుకనో సెట్ అవ్వలేదు, దాంతో మేస్ట్రో ఆల్ మోస్ట్ ఎండ్ కి రావడం తో రీసెంట్ గా నితిన్ కి ఓ స్టొరీ వినిపించడం తో ఇద్దరూ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించాలని చూస్తున్నారట. దాంతో ఇప్పుడు ఈ సినిమా తో కంబ్యాక్ గట్టిగా ప్లాన్ చేయాలని చూస్తున్నారట…..

Leave a Comment