న్యూస్

బాలయ్య అఖండ టీసర్ రివ్యూ….అరాచకం అంతే!

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా వీళ్ళ కాంబినేషన్ లో సింహా మరియు లెజెండ్ సినిమాలు ఓ రేంజ్ లో అంచనాలను క్రియేట్ చేసి ఆ అంచనాలను మించి అలరించాయి. అలాంటిది ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న హాట్రిక్ మూవీ పై అంచనాలు మరో లెవల్ లో…

ఉండగా ఇది వరకు రిలీజ్ అయిన BB3 ఫస్ట్ రోర్ టీసర్ మంచి అంచనాలను క్రియేట్ చేయగా సినిమాలో బాలయ్య మరో లుక్ తాలుకూ పోస్టర్ ను ఉగాది కానుకగా రిలీజ్ చేస్తూ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తారని చెప్పారు కానీ ఏకంగా….

ఆ క్యారెక్టర్ టీసర్ నే రిలీజ్ చేసి ఆడియన్స్ ను థ్రిల్ చేశారు మేకర్స్… సినిమాలో హైలెట్ అవుతుంది అంటున్న అఘోరా లుక్ లో బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్ మరో లెవల్ లో ఉందని చెప్పొచ్చు. ఇక బాలయ్య డైలాగ్స్ కానీ విజువల్స్ కానీ అదిరిపోయాయి. ఇక వీటికి తమన్ అందించిన…

బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే మరో లెవల్ లో ఆకట్టుకుంది. ఓవరాల్ గా అంచనాలను సాలిడ్ గా మించేసే విధంగా ఇప్పటి వరకు ఉన్న క్రేజ్ ను మరో లెవల్ లో తీసుకెళ్ళే విధంగా టీసర్ ఉండగా బాలయ్య బోయపాటి ల కాంబో లో సింహా లెజెండ్ లో ఉన్న సెకెండ్ క్యారెక్టర్స్ తో పోల్చితే ఏమాత్రం తగ్గని రేంజ్ లో గట్టిగా చెప్పాలి అంటే వాటిని కూడా…

డామినేట్ చేసే రేంజ్ లో ఈ సెకెండ్ లుక్ ఉండటం విశేషం, బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఈ క్రేజ్ ను వాడుకుని సినిమా కచ్చితంగా సంచలనాలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి, ఇక ఈ టీసర్ కి యూట్యూబ్ లో మొదటి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి ఇక…

Leave a Comment