టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

బాలయ్య నర్తనశాల టోటల్ OTT కలెక్షన్స్…బ్లాక్ బస్టర్ బొమ్మ!!

నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో మొదలు పెట్టి మధ్యలోనే ఆపేసిన సినిమా నర్తనశాల మొదలు పెట్టిన 16 ఏళ్ల తర్వాత లాస్ట్ ఇయర్  దసరా టైం లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను శ్రేయాస్ యాప్ లో పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే, ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బు ను మంచి పనులకు వాడాబోతున్నామని చెప్పిన బాలయ్య మాటలకు జనాలు బాగా రెస్పాండ్ అయ్యి….

సినిమాను పండగ టైం లో తర్వాత బాగానే చూశారు, దాంతో సినిమా ద్వారా మంచి అమౌంట్ వచ్చింది అని చెప్పాలి, సినిమాకి మొదటి రోజు నుండే సాలిడ్ వ్యూస్ దక్కాయి… మొదటి రోజు 1 లక్షా 95 వేల వ్యూస్ ని, వీకెండ్ లో 2 లక్షల 85 వేల వ్యూస్ ని,

5 రోజుల్లో 4 లక్షల 15 వేల వ్యూస్ ని సొంతం చేసుకోగా మొదటి వారం లో 5 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది, మిగిలిన 4 రోజుల వర్కింగ్ డేస్ లో సినిమా కి 34 వేల దాకా వ్యూస్ దక్కగా టోటల్ గా 2 వీక్స్ టోటల్ గా 5 లక్షల 80 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.

మొత్తం మీద 25 రోజులకు గాను సినిమా 6 లక్షల 8 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది, ఇక సినిమా మొత్తం మీద OTT లో 6 లక్షల 34 వేల దాకా యూనిక్ వ్యూస్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకోగా, తర్వాత ఎప్పుడో కానీ ఒకటి అరా వ్యూస్ ని సొంతం చేసుకుంటూ వస్తుందట. ఓవరాల్ గా 634000 వ్యూస్ కి ఒక్కో టికెట్ రేటు 50 చొప్పున కలెక్షన్స్ కూడా సాలిడ్ గా వచ్చాయి.

సినిమాకి మొత్తం మీద OTT రన్ కంప్లీట్ అయ్యే టైం కి… 3.17 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా ఇందులో 20% శ్రేయాస్ యాప్ వాళ్లకి మిగిలినవి బాలయ్యకి వెల్లబోతున్నాయి. మొత్తం మీద సినిమా అద్బుతమైన కలెక్షన్స్ తో 3 కోట్ల మార్క్ ని అందుకోవడం మాత్రం విశేషం అనే చెప్పాలి. 16 ఏళ్ల క్రితం మూవీ కేవలం 17 నిమిషాల లెంత్ మాత్రమే ఉన్న సినిమా ఇలాంటి వ్యూస్ ని దక్కించుకోవడం విశేషం అనే చెప్పాలి.

Leave a Comment