న్యూస్

బాలయ్య మాస్…6 కొత్త సినిమాలను ఒకేసారి అనౌన్స్ చేశాడు!

నట సింహం నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతో ఇష్టపడి చేసిన ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని ఫ్లాఫ్ రిజల్ట్ తో పాటు భారీ నష్టాలను కూడా సొంతం చేసుకుంది. ఇక తర్వాత చేసిన రూలర్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవుతుంది అనుకున్నా కానీ సినిమా అంచనాలను అందుకోలేక భారీ డిసాస్టర్ అయింది…

ఇలాంటి టైం లో బాలయ్య కంబ్యాక్ ఆశలు పెంచుకున్న సినిమా అఖండ అని చెప్పాలి. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోతున్న సినిమాలు అన్నీ కూడా సాలిడ్ గానే ఉన్నాయి.

రీసెంట్ గా TV9 కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా బాలయ్య తన అప్ కమింగ్ మూవీస్ ని రివీల్ చేశారు. అఖండ తర్వాత ఏకంగా 6 కొత్త సినిమాలను చేయబోతున్నట్లు బాలయ్య కన్ఫాం చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యింది. ముందుగా అఖండ సినిమా ఆ సినిమా తర్వాత…

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో కొత్త సినిమాను, ఆ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాను చేయబోతున్న బాలయ్య, వీటి తర్వాత హారికా హాసినీ బ్యానర్ లో ఒక సినిమాను, తర్వాత తన బ్యానర్ లో ఓ కొత్త డైరెక్టర్ తో ఒక సినిమా చేయబోతున్నాడట, వీటి తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్న బాలయ్య ఈ సినిమాలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత…

తన కెరీర్ లోనే స్పెషల్ మూవీ అయిన ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ ని ఆదిత్య 999 పేరుతో భారీ ఎత్తున తన డైరెక్షన్ లోనే చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇందులోనే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెప్పారు. మొత్తం మీద బాలయ్య అప్ కమింగ్ మూవీస్ లైనప్ అదిరిపోయిందని అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య రచ్చ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Leave a Comment