గాసిప్స్ న్యూస్ స్పెషల్

బాలయ్య సై అంటే ఆగిపోయిన 100 వ సినిమా చేస్తా: కృష్ణవంశీ!!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఫామ్ లో లేక చాలా కాలమే అయింది, అప్పుడెప్పుడో చందమామ సినిమా హిట్ తర్వాత ఇప్పటి వరకు హిట్ అంటే తెలియకుండా ఉన్నారు, లాస్ట్ టైం చేసిన సినిమా నక్షత్రం ఊహకందని డిసాస్టర్ అయిన విషయం తెలిసిందే, కాగా తర్వాత సినిమా ఏంటి అనేది ఇప్పటి వరకు కన్ఫాం చేయని కృష్ణవంశీ రీసెంట్ గా సోషల్ మీడియా లో తన ఫాలోవర్స్ తో చేసిన చిట్ చాట్ కొన్ని ఆసక్తి కరమైన కామెంట్స్ చేయగా…

వాటిలో బాలయ్య తో ఒక సినిమా అనుకున్నారు కథ ఆ సినిమా కి ఏమైంది అని ఫాలోవర్ ప్రశ్న అడగ్గా… కృష్ణవంశీ బాలయ్య తో నేను “రైతు” అనే సినిమా చేద్దామని అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కాన్సిల్ అవ్వాల్సి వచ్చిందని చెప్పారు.

బాలయ్య సై అంటే ఆ సినిమా చేయడానికి నేను సిద్ధమే అంటూ చెప్పుకొచ్చాడు కృష్ణవంశీ.. అప్పట్లో బాలయ్య 100 వ సినిమా గా ఈ సినిమా ను అనుకున్నట్లు వార్తలు గట్టిగానే శిఖారు చేశాయి. కానీ ఈ సినిమా ప్లేస్ లో బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి చేశారు. మరి ఫ్యూచర్ లో అయినా ఈ సినిమా చేస్తారో లేదో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!