గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

బాహుబలి2 కన్నా నా సినిమా కలెక్షన్స్ ఎక్కువ- అమితాబ్ బచ్చన్!!

  బాలీవుడ్ శెహన్ షా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ క్రేజ్ గురించి నేటి జనరేషన్ వారికి తక్కువే తెలుసు, కానీ ఒక దశలో బాలీవుడ్ మొత్తాన్ని ఓ రేంజ్ లో ఏలిన ఘనత అమితాబ్ ది. తన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసివి, సినిమా సినిమా కి తన రికార్డులు తానె బ్రేక్ చేసుకునే వాడు. అలాంటి రికార్డులు ఎన్నో చూసిన అమితాబ్ ఇప్పటికీ కూడా టాప్ స్టార్స్ అండ్…

యంగ్ స్టార్స్ ని కి పోటి పడుతూ సినిమా లు చేస్తుండటం విశేషం. సినిమా లతో పాటు సోషల్ మీడియా లో కూడా యమ యాక్టివ్ గా ఉండే అమితాబ్ బచ్చన్ రీసెంట్ గా సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టారు. అది మన బాహుబలి 2 ని టార్గెట్ చేసే విధంగా ఉంది.

తానూ మూడు పాత్రల్లో నటించిన అమర్ అక్బర్ ఆంథోని సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 43 ఏళ్ళు పూర్తీ చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా లో ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా అప్పట్లోనే టోటల్ రన్ లో 7.25 కోట్ల కలెక్షన్స్ ని సాధించిందని.

ఆ కలెక్షన్స్ ని చూసినవారిని, టికెట్ రేట్ల ని ఇప్పటి లెక్కల్లో పరిగణ లోకి తీసుకుంటే సినిమా కలెక్షన్స్ ఇప్పుడు బాహుబలి 2 కంటే కూడా ఎక్కువగా ఉంటాయని పోస్ట్ పెట్టారు, అప్పట్లో టీవీ లు, సోషల్ మీడియా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లాంటివి లేవు, అందరూ థియేటర్స్ కి వెళ్ళే సినిమాలు చూసే వారు. ఆ లెక్కన ఎక్కువ మంది చూసేవారు.

ఆ లెక్కన తెగిన టికెట్ లెక్కలు ఇప్పటి లెక్కలో చూసుకుంటే ఎన్నో సినిమాల కన్నా కూడా ఎక్కువ కలెక్షన్స్ పాత సినిమాలు బీట్ చేస్తాయి, ఈ ఉద్దేశ్యంతోనే అమితాబ్ ఇలా పోస్ట్ పెట్టారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చూడటానికి చుట్టూ ఎన్నో ఆప్షన్స్ ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర వీర లెవల్ లో కలెక్షన్స్ ని సాధించిన బాహుబలి రేంజ్ ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే..

Leave a Comment