గాసిప్స్ న్యూస్

బిగ్గెస్ట్ క్లాష్ ఆఫ్ టాలీవుడ్…ఎవరు తగ్గురారో చూడాలి!!

ఫస్ట్ వేవ్ తర్వాత సినిమాలు బాగా ఆదరిస్తున్నారు అని తెలిసిన వెంటనే వరుస పెట్టి సినిమాలను రిలీజ్ చేశారు మేకర్స్, కానీ సెకెండ్ వేవ్ తర్వాత జనాలు థియేటర్స్ కి వస్తున్నారు కానీ ఆంధ్రలో పరిస్థితులు ఇంకా సెట్ కాక పోవడం తో పెద్ద మూవీస్ రిలీజ్ డేట్స్ విషయంలో అసలు క్లారిటీ లేకుండా పోయింది. ఈ ఇయర్ ఎండ్ టైం కి థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్న సినిమాలుగా…

అఖండ, ఖిలాడీ, ఆచార్య మరియు పుష్ప సినిమాలు నిలిచే అవకాశం ఉండగా అఖండ మరియు ఖిలాడీ త్వరలో రిలీజ్ కాబోతుండగా మిగిలిన ఆచార్య మరియు పుష్ప పార్ట్ 1 విషయంలో ఇప్పుడు టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ క్లాష్ జరిగే అవకాశం ఉందన్న వార్తలు కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి.

పుష్ప డిసెంబర్ 17 న రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా ఆ డేట్ నే ఆచార్య టీం కూడా అనుకుంటూ ఉంది, దానికి కారణం కూడా ఉంది, దసరా దీపావళికి అనుకుంటే టికెట్ రేట్లు సెట్ కాకపోవడం అండ్ ఈ లోపు దీపావళికి అఖండ ఆల్ మోస్ట్ కన్ఫాం అనడం, ఇక సంక్రాంతికి అనుకుంటే ఆర్ ఆర్ ఆర్ ఉండటంతో…

ఇక వచ్చే ఇయర్ సమ్మర్ కి ప్లాన్ చేసుకోవాలి కానీ ఇప్పటికే ఈ మూవీ ఆలస్యం అవ్వడంతో అప్పటి వరకు ఆగలేని పరిస్థితి ఉండటం తో ఇప్పుడు డిసెంబర్ లోనే రావాలని 17న రిలీజ్ అవ్వాలని అనుకుంటున్న టైం లో క్రిస్టమస్ కి రిలీజ్ అని చెప్పిన పుష్ప టీం వెంటనే డేట్ ను 17న అని ప్రకటించి ఆచార్య టీం ఆశలపై నీళ్ళు జల్లింది…

దాంతో ఇప్పుడు ఆచార్య రావాలి అనుకుంటే అదే డేట్ కి లేదా క్రిస్టమస్ రోజున రిలీజ్ అయ్యే ఆప్షన్స్ మాత్రమె ఉండగా సోలో రిలీజ్ కావాలి అంటే అన్ సీజన్ గా భావించే నవంబర్ లో రావాల్సి ఉంటుంది, కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఆచార్య కూడా డిసెంబర్ 17న రావడానికే ఎక్కువ అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరి ఫైనల్ గా మెగా క్లాష్ తప్పదా లేక ఎవరైనా తగ్గుతారో చూడాలి.

Leave a Comment