న్యూస్

బిగ్ బాస్ 3 ఎప్పుడు స్టార్ కాబోతుందో తెలుసా?

రియాలిటీ షో లలో తెలుగు లో బాగా పాపులర్ అయిన షో బిగ్ బాస్, ఇప్పటి వరకు 2 సీజన్స్ జరగగా ఇద్దరు హోస్ట్ లు మారారు. ఇక ఇప్పుడు మూడో సీజన్ కి మూడో హోస్ట్ గా కింగ్ నాగార్జున ని ఎంచు కున్నారు. ఇక ఈ సీజన్ ఎప్పుడెప్పుడు మొదలు అవుతుంది, ఎంత మంది పాల్గొంటారు అన్నది ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ పీక్స్ లో ఉన్న కారణంగా అది పూర్తి అయ్యాకే బిగ్ బాస్ సీజన్ 3 ని మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. దాంతో వరల్డ్ కప్ పూర్తి అయ్యాకే టెలికాస్ట్ కాబోతుంది మూడో సీజన్. వరల్డ్ కప్ ఫైనల్ జులై 14 ఆదివారం జరగబోతుంది.

దాంతో ఒక వారం గ్యాప్ ఇచ్చి 21 వ తేదీ నుండి బిగ్ బాస్ సీజన్ 3 ని మొదలు పెట్టాలని చూస్తున్నారట. 14 మంది కంటిస్తంట్స్ తో 100 రోజుల పాటు జరిగే సీజన్ 3 ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తుందో మరెన్ని ఆర్మీలు పుట్టుకు వస్తాయో అన్నది ఆసక్తి గా మారింది.

Leave a Comment