గాసిప్స్ న్యూస్

బిగ్ బాస్ 5 లాంచ్ ఎపిసోడ్ కి అంత ఖర్చు చేశారా!

కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కొత్త సీజన్ వచ్చేసింది… కింగ్ నాగార్జున 3 వ సారి హోస్ట్ చేస్తుండగా ఓవరాల్ గా 5 వ సీజన్ గా బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడు ఏకంగా 19 మంది కంటెస్టంట్స్ తో మొదలు అయింది… చాలా రోజులుగా ఎవరు వస్తారో అన్న లీకులు చాలానే రాగా ఆల్ మోస్ట్ లీకులు చాలా వరకు నిజం అయ్యాయి. ఇక లాంచ్ ఎపిసోడ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేయగా…

దాదాపు అందరికీ స్పెషల్ ఎంట్రీలు, ఏవి లు చాలానే ప్లాన్ చేశారు షో మేకర్స్… మొత్తం మీద లాంచ్ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ రాగా ఓవరాల్ గా 19 మంది కంటెస్టంట్స్ అండ్ కింగ్ నాగ్ స్టైలిష్ లాంచ్ ల కోసం కూడా భారీగా ఖర్చు చేశారట…

ఛానెల్ వర్గాల నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఫస్ట్ ఎపిసోడ్ కోసం ఏకంగా 2 కోట్ల రేంజ్ లో ఖర్చు చేశారట. కేవలం లాంచ్ ఎపిసోడ్ నే ఈ రేంజ్ లో ప్లాన్ చేసి భారీ లెవల్ లో మొదలు పెట్టగా ఇక షో కూడా మిగిలిన సీజన్స్ కన్నా ఎక్కువ రోజులు ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ సీజన్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి…

Leave a Comment