న్యూస్ స్పెషల్

బిగ్ బాస్3 ఫైనల్ రికార్డ్ TRP….మెగాస్టార్ క్యామియో TRP పీక్స్!!

ఇండియాలో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, టాలీవుడ్ లో రెండేళ్ళ క్రితం మొదలు అయిన ఈ రియాలిటీ షో కి హోస్ట్ గా ఎన్టీఆర్ మొదటి సీజన్ ని హోస్ట్ చేసి తెలుగు లో బిగ్ సక్సెస్ కి నాంది పలికాడు, ఇక రెండో సీజన్ ఒక్క కంటిస్టంట్ క్రేజ్ తో సీజన్ మొత్తం సాగి ఆకట్టుకోగా మూడో సీజన్ ఎలా ఉంటుంది అన్న ఆసక్తి పెరిగి పోగా…

కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన మూడో సీజన్ పర్వాలేదు అనిపించినా ఫైనల్ ఎపిసోడ్ మాత్రం ఆల్ టైం రికార్డ్ TRP రేటింగ్ తో సంచలనం సృష్టించింది, ఎంతలా అంటే తెలుగు లోనే కాదు ఇండియా లో అన్ని బిగ్ బాస్ సీజన్స్ ఫైనల్స్ TRP రేటింగ్ లలో నంబర్ 1 గా నిలిచింది.

మూడో సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కి ఏకంగా 18.29 TRP రేటింగ్ దక్కినట్లు సమాచారం. దాంతో మూడు సీజన్స్ లో బిగ్గెస్ట్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది. ఒకసారి మూడు సీజన్స్ ఫైనల్ ఎపిసోడ్స్ TRP రేటింగ్ ని గమనిస్తే
?#BiggBossTelugu1 (Finals) – 14.13 TRP Rating
?#BiggBossTelugu2 (Finals) – 15.05 TRP Rating
?#BiggBossTelugu3 (Finals) – 18.29 TRP Rating

ఇలా సంచలనం సృష్టించిన మూడో సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా సర్పైజ్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి, షో చివరి గంట సేపు మెగాస్టార్ హంగామా కొనసాగగా ఆ స్పెషల్ క్యామియో కి TRP రేటింగ్ పీక్స్ కి వెళ్లిందని సమాచారం. ఛానల్ చెప్పిన సమాచారం ప్రకారం.

మెగాస్టార్ క్యామియో టైం గంటలో ఏకంగా TRP రేటింగ్ 22.24 TRP రేటింగ్ ని క్రాస్ అయిందట. ఫైనల్ విన్నర్ ని అనౌన్స్ చేసే టైం అలాగే మెగాస్టార్ ప్రజన్స్ ఉండటం తో ఓవరాల్ గా ఇండియా బిగ్ బాస్ హిస్టరీ లోనే టాలీవుడ్ బిగ్ బాస్ 3 సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ఆల్ టైం రికార్డ్ TRP రేటింగ్ తో సంచలన రికార్డ్ ను నమోదు చేసింది.

Leave a Comment