గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

బిచ్చగాడు హీరో కొత్త సినిమా బడ్జెట్…కెరీర్ లో హైయెస్ట్!!

ఒక్క సినిమా తో సెన్సేషనల్ క్రేజ్ ని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు, మ్యూజిక్ డైరెక్టర్ నుండి యాక్టర్ గా మారిన విజయ్ ఆంటోని 2016 లో బిచ్చగాడు అనే ఒక్క సినిమా తో రెండు చోట్లా కూడా అద్బుతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. అంతకుముందు సలీమ్ లాంటి సినిమాలు మంచి పేరు తెచ్చినా కానీ తనకంటూ ఒక మార్కెట్ ని బిచ్చగాడు సినిమా తమిళ్ తెలుగు లో క్రియేట్ చేసింది.

కానీ విజయ్ ఆంటోని తర్వాత చేసిన సినిమాలు ఆ మార్కెట్ ని వాడుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల బడ్డాయి. లాస్ట్ ఇయర్ కిల్లర్ మూవీ తో మళ్ళీ హిట్ కొట్టిన విజయ్ ఆంటోని ఇప్పుడు బిచ్చగాడు సీక్వెల్ ని మొదలు పెట్టగా మరో పక్క…

జ్వాలా అనే యాక్షన్ మూవీ ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయిందని అనౌన్స్ చేయగా ఈ సినిమా బడ్జెట్ ని కూడా రివీల్ చేశారు, ఆ బడ్జెట్ చూసి అటు కోలివుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఒకింత షాక్ కి గురి అవుతున్నారు అనే చెప్పాలి.

విజయ్ ఆంటోని సినిమాలు అన్నీ కూడా లో టు మీడియం కన్నా తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువగా తెరకెక్కుతూ ఉండేవి, ఎక్కువ శాతం సినిమాలు 3 కోట్ల లోపు బడ్జెట్ లోనే తెరకెక్కగా బిచ్చగాడు తర్వాత చేసిన భేతాలుడు ఒక్కటి 10 కోట్ల మార్క్ ని అందుకుంది. కానీ ఇప్పుడు జ్వాలా సినిమా బడ్జెట్ మాత్రం ఏకంగా ఈ మార్క్ ని డబుల్ మార్జిన్ తో…

క్రాస్ చేసి ఏకంగా 25 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ ఎత్తున రూపొందుతుంది అంటున్నారు, విజయ్ ఆంటోని తో పాటు సినిమాలో అరుణ్ విజయ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా భారీ లెవల్ లో రూపొందిన ఈ యాక్షన్ మూవీ ని ఇప్పుడు త్వరలో ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంత బడ్జెట్ రికవరీ అవ్వాలి అంటే సినిమా రెండు చోట్లా బిచ్చగాడుకి మించిన విజయాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది మరి…

Leave a Comment