న్యూస్ స్పెషల్

బిజినెస్ కోటి లోపే… సెన్సేషనల్ TRP దక్కించుకున్న కనులు కనులను దోచాయంటే!

ఈ ఇయర్ టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో హిట్ అయిన సినిమాలే కొన్ని కాగా అందులో డబ్ మూవీ మాత్రం ఓకె ఒక్కటి అని చెప్పాలి. ఆ సినిమా నే కనులు కనులను దోచాయంటే… చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ కూడా ఉండలేక పరుగును ముగించినట్లే ముగించి తిరిగి మౌత్ టాక్ అల్ట్రా పాజిటివ్ గా ఉండటం తిరిగి థియేటర్స్ లో కి వచ్చి…

బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని తెలుగు లో క్లీన్ హిట్ గా నిలిచింది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ బిజినెస్ కోటి లోపే ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది, ఇక టెలివిజన్ లో కూడా సినిమా…

శాటిలైట్ రైట్స్ కోటి లోపే అని తెలుస్తుంది. కానీ సినిమా ఫస్ట్ టైం రీసెంట్ గా టెలికాస్ట్ అయ్యి సాలిడ్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. అసలు పెద్దగా ప్రమోషన్ కూడా చేయకుండానే సినిమాకి మంచి TRP రేటింగ్ దక్కడం విశేషం అనే చెప్పాలి.

సినిమా ను కొన్న మాటివి ఫస్ట్ టైమే మంచి ప్రాఫిట్ దక్కేలా సినిమా 7.1 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇది రీసెంట్ టైం లో కొన్ని పెద్ద సినిమాలకు వచ్చిన TRP రేటింగ్ రేంజ్ లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు సైలెంట్ గా టెలివిజన్ లో కూడా సూపర్ హిట్ అనిపించుకే రేంజ్ TRP రేటింగ్ ని అందుకుంది కనులు కనులను దోచాయంటే సినిమా.

మరో విశేషం ఏంటంటే లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఖైదీ తెలుగు TRP రేటింగ్ 4.1 కాగా… అంతకన్నా భారీ బిజినెస్ చేసిన NGK, బందోబస్ట్ లాంటి సినిమాలతో పోల్చితే ఈ సినిమా తక్కువ రేటు తోనే మంచి TRP రేటింగ్ ని సాధించి దుమ్ము లేపింది…

Leave a Comment