న్యూస్ రివ్యూ

బొంభాట్ మూవీ రివ్యూ!…మరో ఆదిత్యా369 అన్నారు…..రోబోని దింపేశారు!!

రీసెంట్ గా వచ్చిన సినిమాలల్లో ట్రైలర్ తో కొంచం ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన సినిమా బొంభాట్, ట్రైలర్ లో కొద్ది సేపు సిల్లీ స్టొరీ లానే ఉన్నా తర్వాత నుండి మలుపులు ఆకట్టుకోవడంతో సినిమా ఎలా ఉంటుందో అని ఆడియన్స్ లో కొంచం ఆసక్తి క్రియేట్ అయింది, ఇక యూనిట్ కూడా ఇది మరో ఆదిత్యా 369 టైప్ కథ అని ఆడియన్స్ ని మెప్పిస్తుంది అంటూ ఊదేశారు.. మరి డైరెక్ట్ రిలీజ్ అయిన సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే హీరో చిన్నప్పటి నుండి తనో దురదృష్టవంతుడు అన్న రిమార్క్ పడుతుంది, అది పెరిగి పెద్దయ్యాక కూడా కంటిన్యు అవుతూ ఉండగా, ఈ బ్యాడ్ లక్ తోనే సింగిల్ గా ఉంటున్న హీరో కి అనుకోకుండా ఒక సైంటిస్ట్ కం ప్రొఫెసర్ తో పరిచయం వలన…

లైఫ్ లో మార్పులు వస్తాయి, తను ఎప్పటి నుండో ప్రేమిస్తున్న చాందిని చౌదరికి ప్రపోజ్ చేయడం, తర్వాత సెట్ కాక బ్రేక్ అప్ కూడా చెప్పడం జరుగుతుంది, కానీ తర్వాత అనుకోకుండా ప్రొఫెసర్ చనిపోతారు, ఆయన కూతురు సిమ్రాన్ చౌదరి ని చూసుకోవాల్సిన భాద్యత…

హీరో మీద పడగా తర్వాత ఏమైంది, అసలు ప్రొఫెసర్ ఎలా చనిపోయారు, దాని వెనక ఎవరు ఉన్నారు, హీరో ఇవన్నీ ఎలా సాల్వ్ చేశాడు అన్నది ఓవరాల్ కథ పాయింట్… పెర్ఫార్మెన్స్ పరంగా హీరో సాయి సుశాంత్ రెడ్డి జస్ట్ ఓకే అనిపించే పెర్ఫార్మెన్స్ తో సరిపెట్టేశాడు. హీరోయిన్స్ ఇద్దరికీ కూడా..

కొంచం నటించే స్కోప్ ఉండగా ఇద్దరూ పర్వాలేదు అనిపించారు, మిగిలిన రోల్స్ చేసిన నటీనటులు అందరూ కూడా ఉన్నంతలో తమవరకు నటించారు… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా నాసిరకంగా ఉంది, సీన్ కి సీన్ ఏమాత్రం సింక్ లేని ఎడిటింగ్ చేశారు. డైలాగ్స్ కొద్ది వరకు ఆకట్టుకున్నాయి. ఇక మ్యూజిక్ పరంగా…

పాటలు జస్ట్ ఓకే అనిపించగా బ్యాగ్రౌండ్ కూడా సినిమా వరకు బాగానే మెప్పించాయి అని చెప్పాలి… ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే రాఘవేంద్ర వర్మ అనుకున్న పాయింట్ బాగానే ఉన్నా తెరకెక్కించడంలో పూర్తిగా విఫలం అయ్యారు… ఒకటి రెండు సీన్స్ తప్పితే సినిమాలో ఎక్కడ కూడా…

ఆకట్టుకునే అంశాలు ఏమి కనిపించలేదు, సినిమా కథ ఆదిత్య 369 అంటూ ఊదరగొట్టిన ఇది రోబో కథని కంప్లీట్ గా కాపీ కొట్టి తీసిన కథ ఇది…అది సినిమా చూస్తె అర్ధం అవుతుంది, కాపీ కొట్టినా కథనం ఆకట్టుకునేలా చూసుకుంటే బాగుండేది కానీ అది చూసుకోక పోవడం తో తీవ్రంగా దెబ్బకొట్టింది సినిమా…

సినిమాలో ఆకట్టుకున్న అంశం ఏదైనా ఉందీ అంటే అది సునీల్ అందించిన వాయిస్ ఓవర్, అది తప్పితే ఎక్కడో ఒకటి రెండు సీన్స్ తప్పితే సినిమా కంప్లీట్ గా నీరసం తెప్పించి ఎందుకు చూస్తునామో కూడా తెలియకుండా చేసేలా బోర్ కొట్టించింది అని చెప్పాలి.

మొత్తం మీద సినిమా కొత్త కథలు చూసే వారు, రొటీన్ మూవీస్ చూసే వారికి కూడా ఎక్కే అవకాశం లేదు, ట్రైలర్ మెప్పించినా సినిమా ఏ దశలో కూడా ఆడియన్స్ మనసు గెలుచుకోలేక పోయింది అని చెప్పాలి. ఫైనల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 1.5 స్టార్స్….

Leave a Comment