న్యూస్

బ్రహ్మోత్సవం ఫెయిల్ అయినా నేను ఫెయిల్ అవ్వలేదు…అడ్డాల షాకింగ్ కామెంట్స్!

ఓ 5 ఏళ్ల క్రితం సమ్మర్ టైం లో ఆడియన్స్ ముందుకు సూపర్ హిట్ కాంబినేషన్ లో సాలిడ్ హైప్ నడుమ థియేటర్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల ల కాంబోలో రూపొందిన సినిమా బ్రహ్మోత్సవం రిలీజ్ అయింది, సినిమా మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని అప్పటి వరకు మహేష్ కెరీర్ లో ఇదే వీకేస్ట్ మూవీ గా పేరు తెచ్చుకుని భారీ నష్టాలను సొంతం చేసుకుంది.

ఆ సినిమా తర్వాత మహేష్ కి మళ్ళీ స్పైడర్ తో దెబ్బ పడినా తర్వాత కంబ్యాక్ తో దూసుకు పోతున్నాడు కానీ బ్రహ్మోత్సవం సినిమా తో సాలిడ్ దెబ్బ తిన్న శ్రీకాంత్ అడ్డాల నుండి కొత్త సినిమా రావడానికి ఏకంగా 5 ఏళ్ల టైం పట్టింది. అది కూడా ఒరిజినల్ కాకుండా…

అసురన్ రీమేక్ నారప్ప తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు శ్రీకాంత్ అడ్డాల. సినిమా కథ ముందు చెప్పినప్పుడు ఒకలా తెరకెక్కించినప్పుడు ఒకలా మారితే అది కచ్చితంగా డైరెక్టర్ ఫాల్ట్ అనే చెప్పాలి. స్క్రిప్ట్ ని సీన్ వైజ్ కరెక్ట్ గా రాసుకుంటే కొన్ని ఎక్స్ ట్రా సీన్స్ తప్పితే…

మిగిలిన సినిమా యాసిటీస్ స్క్రిప్ట్ ప్రకారం తెరకెక్కించే డైరెక్టర్స్ చాలా మంది ఉన్నా శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కి కూడా కథ పకడ్బందీగా లేకున్నా ఆన్ లోకేషన్స్ లో సీన్స్ ని అనుకుని డైరెక్ట్ చేయగా అప్పుడు అది వర్కౌట్ అయినా బ్రహ్మోత్సవంకి మాత్రం ఎదురుదెబ్బ కొట్టింది. దాంతో డైరెక్టర్ గా తను ఫెయిల్ అయినప్పటికీ తన తప్పు లేదన్నట్లు…

సినిమా ఫెయిల్ అయిన నేను ఫెయిల్ అవ్వలేదు అంటూ ఇప్పుడు నారప్ప ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు అడ్డాల… కానీ మహేష్ బాబు ఇచ్చిన అద్బుత అవకాశాన్ని వృదా చేసుకున్నని చెబుతూ ఇప్పుడు తిరిగి వరుస సినిమాలను చేయడానికి సిద్ధం అవుతున్నని చెబుతున్నాడు అడ్డాల… బ్రహ్మోత్సవం ఫ్లాఫ్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న అడ్డాల ఆ ఇంపాక్ట్ ని అప్ కమింగ్ మూవీస్ మీద పడకూడదని భావిస్తున్నారు. ఫ్యూచర్ ప్రాజెక్ట్ లతో మంచి సక్సెస్ లను సొంతం చేసుకోవాలని మనమూ కోరుకుందాము.

Leave a Comment