గాసిప్స్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: టీసర్ లేదు…ఫస్ట్ లుక్ లేదు..రీజన్ ఇదేనా!!

అరవింద సమేత సినిమా అయిన వెంటనే ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ మొదలు పెట్టిన ప్రతిష్టాత్మక మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ఎప్పటి కప్పుడు పోస్ట్ పోన్ ల పరంపర ని కొనసాగిస్తూనే ఉంది, రిలీజ్ డేట్ ఈ ఇయర్ లో అనుకుంటే వచ్చే సంక్రాంతి కి తర్వాత సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది, ఇక ఎన్టీఆర్ కొత్త సినిమాల అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్…

గత రెండేళ్ళు గా ఎదురు చూస్తూనే ఉన్నారు, రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ నుండి మళ్ళీ ఎక్కువ యాక్టివ్ గా సోషల్ మీడియా లో ఉంటున్న ఫ్యాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే కి రిలీజ్ అయ్యే టీసర్ అండ్ ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూపులు చూడగా..

లాక్ డౌన్ వలన అన్ని షూటింగ్స్ ఆగిపోగా… ముందే రామ్ చరణ్ ఇంట్రో వీడియో తీయడం తో అది రిలీజ్ అయినప్పటికీ ఎన్టీఆర్ బర్త్ డే సమయానికి కూడా పరిస్థితులు సద్దుకోక పోవడం తో టీం ఇప్పుడు ఎలాంటి టీసర్ కానీ లుక్ కానీ రిలీజ్ చేయడం లేదని అనౌన్స్ చేసింది.

దాంతో ఫ్యాన్స్ భాద పడుతున్నా ఇలా చేయడానికి రీజన్స్ ఉన్నాయట. యూనిట్ సినిమా ఫుటేజ్ నుండి ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇంట్రో తీయాలి అనుకున్నా అది కుదరలేదట, ఇతర సీన్స్ కి లింక్ అయి ఉండటం సీజీ వర్క్ కూడా ఉండటం తో అవి కుదరలేదు అని అంటున్నారు. ఎట్ లీస్ట్ ఫస్ట్ లుక్ అయినా రివీల్ చేస్టారు అనుకున్నా కానీ…

సాదా సీదా లుక్ రిలీజ్ చేస్తే మళ్ళీ రామ్ చరణ్ ఇంట్రో తో కంపేర్ లు అవుతాయని, ఫ్యాన్ వార్స్ జరిగే చాన్స్ ఉందని, అందుకే అన్నీ సద్దుకున్నాక ఫ్యాన్స్ అంచనాలను మించే లుక్ అండ్ టీసర్ రిలీజ్ చేయాలని యూనిట్ ఫిక్స్ అయ్యారట. చివరి నిమిషం వరకు లుక్ లేదా టీసర్ వస్తుంది అని ఊరించి ఇప్పుడు ఏమి లేదని చెబుతుండటం తో ఫ్యాన్స్ యూనిట్ పై కోపంగా ఉన్నారు. మరి వాళ్ళని మరిపించేలా ఎన్టీఆర్ లుక్ అండ్ టీసర్ ని టీం ఎప్పుడు రిలీజ్ చేస్తుందో చూడాలి.

Leave a Comment