గాసిప్స్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: డీల్ కాన్సిల్ చేసిన టక్ జగదీష్…ఆ రోజే రిలీజ్!

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ కోసం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. సినిమా ను ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా తీసుకు రావాలి అనుకున్నారు కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వగా ఇప్పుడు పాండమిక్ తర్వాత వరుస పెట్టి సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తూ ఉండటం తో…

టక్ జగదీష్ కూడా వస్తుందని అందరూ అనుకున్నారు కానీ రీసెంట్ గా సినిమా మేకర్స్ సినిమాను అమెజాన్ ప్రైమ్ కి హ్యుమంగస్ రేటుకి అమ్మినట్లు ఆల్ మోస్ట్ కన్ఫాం అయింది. సెప్టెంబర్లో లో వినాయక చవితికి సినిమా డిజిటల్ లో రిలీజ్ కానుందని టాలీవుడ్ మొత్తం వార్తలు ప్రచారం అవ్వగా…

మేకర్స్ మాత్రం అసలు సినిమా గురించి ఇన్ని వార్తలు వస్తున్నా అవి రూమర్స్ అని ఏమి చెప్పలేదు… ఇక రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు మిక్సుడ్ రివ్యూలతో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాదిస్తున్న SR కళ్యాణ మండపం విజయం టక్ జగదీష్ తో పాటు ఇతర సినిమాలకు మంచి హోప్స్ ని ఇచ్చింది.

దాంతో ఇప్పుడు టక్ జగదీష్ టీం అమెజాన్ ప్రైమ్ తో జరిగిన డీల్ ని కాన్సిల్ చేసుకున్నారని థియేటర్స్ లోనే సినిమాను రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవుతున్నారని టాలీవుడ్ ట్రేడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 19/26 న సినిమా ను ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారని కూడా వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి.

ఇది కనుక నిజం అయితే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర నాని మాస్ ఓపెనింగ్స్ తో కుమ్మేయవచ్చు, కానీ ఇన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నా కానీ మేకర్స్ ఇప్పటి వరకు కూడా ఏ విషయాన్నీ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, కానీ అతి త్వరలోనే సినిమా పై క్లియర్ అనౌన్స్ మెంట్ ఉండబోతుందని అంటున్నారు. మరి ఆ అప్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Leave a Comment