న్యూస్

బ్రేకింగ్: రాధే శ్యామ్ వ్యూస్ ని తగ్గించిన యూట్యూబ్….అసలు ఏం జరిగింది!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ రాధే శ్యామ్ అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేయగా టీసర్ కి మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రాగా, ఇనీషియల్ గా రికార్డులను క్రియేట్ చేయడంలో విఫలం అయిన ఈ టీసర్ 9 గంటలు పూర్తీ అయ్యే టైం కి మెయిన్ ఛానెల్ లో 10 మిలియన్ వ్యూస్ నే సొంతం చేసుకున్నా….

తర్వాత సడెన్ గా సినిమా టీసర్ వ్యూస్ గంట గంటకి మిలియన్స్ లో పెరుగుతూ ఏకంగా 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 42.7 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా తర్వాత కూడా ఫుల్ జోష్ తో వ్యూస్ మిలియన్స్ లో గంట గంటకి పెరిగిపోతూ 60 మిలియన్స్….

మార్క్ ని కూడా దాటేసి జోరు తగ్గకుండా 63.39 మిలియన్స్ మార్క్ తర్వాత స్లో డౌన్ అవ్వగా సడెన్ గా ఆ వ్యూస్ మార్క్ నుండి యూట్యూబ్ సినిమా టీసర్ లో ఏకంగా 1.39 మిలియన్ వ్యూస్ ని ఒకేసారి తొలగించింది… దాంతో ఇదేంటి అంటూ అందరూ షాక్ అయ్యారనే చెప్పాలి…

టాలీవుడ్ లో ఇలా వ్యూస్ టీసర్ కి ట్రైలర్ కి తగ్గిపోవడం అన్నది కొన్ని సినిమాల విషయం లో జరిగింది కానీ ఇలా ఏకంగా 1.39 మిలియన్స్ వరకు వ్యూస్ ఒకేసారి తగ్గిపోవడం అన్నది ఒక్క రాధే శ్యామ్ టీసర్ విషయంలోనే జరిగింది, దీని వెనుక కారణం ఏంటి అనేది ఇంకా తెలియలేదు కానీ యూట్యూబ్ గ్లిట్చ్ అయినా అవ్వొచ్చు లేదా ఫేక్ వ్యూస్ అయినా కావొచ్చు…

యూట్యూబ్ గ్లిట్చ్ అయితే తిరిగి వ్యూస్ పెరిగేవి కానీ అలా జరగలేదు… సో ఫ్యాన్సో లేక మేకర్సో టీసర్ వ్యూస్ పెంచడానికి బోట్స్ ని కనుక వాడి ఉంటే ఆ వ్యూస్ ని యూట్యూబ్ వాళ్ళు తొలగించి ఉంటారు అని చెప్పొచ్చు… 1.39 మిలియన్ వ్యూస్ తొలగి పోయినా ఇప్పటికే వ్యూస్ పరంగా టాలీవుడ్ లో చాలా రికార్డులను నమోదు చేసింది రాధే శ్యామ్ టీసర్…

Leave a Comment