గాసిప్స్ న్యూస్

బ్లాక్ బస్టర్ “అసురన్” రీమేక్…ఈ డైరెక్టర్ ని మీ కలలో కూడా ఊహించి ఉండరు!!

కొన్ని సినిమాలు ఒరిజినల్ ని మరిపించేలా రీమేక్ చేయడం చాలా కష్టం, కొందరు అలా రీ క్రియేట్ చేయలేక సినిమాలను చెడగొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కొందరు మాత్రం ఒరిజినల్ కథ తీసుకుని డానికి లోకల్ నేటివిటీ జోడించి ప్రేక్షకులను మెప్పిస్తారు. టాలీవుడ్ రంగస్థలం సినిమా ను కొద్ది వరకు పోలి ఉన్నా తమిళ్ నేటివిటీ మెండుగా ఉన్న ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ అసురన్ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఆ సినిమా చూసిన వాళ్ళు అందరు ఈ సినిమా తెలుగు లో బాగా వర్కౌట్ అవుతుందని చెప్పడం తో ఆ రీమేక్ ని చేయడానికి విక్టరీ వెంకటేష్ ముందుకు వచ్చారు. కానీ ఎవరు ఆ సినిమా తెలుగు రీమేక్ ని హ్యాండిల్ చేసే డైరెక్టర్ అన్న ఆసక్తి అందరిలోనూ కొనసాగుతుండగా….

వరుసగా కొందరు డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నా ఇప్పుడు రేసులో ఎవ్వరూ కలలో కూడా ఊహించని డైరెక్టర్ పేరు వినిపిస్తుంది, టాలీవుడ్ లో మంచితనానికి కేరాఫ్ అడ్రస్ లాంటి పాత్రలను తీర్చిదిద్దే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా రీమేక్ రేసులో ఇప్పుడు అందరికన్నా ముందు ఉన్నాడని సమాచారం.

2016 లో మహేష్ తో చేసిన బ్రహ్మోత్సవం డిసాస్టర్ తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమా మొదలు పెట్టని అడ్డాల 4 ఏళ్ల తర్వాత తనకి ఏమాత్రం సూట్ కానీ డిఫెరెంట్ రా రాస్టిక్ బ్యాగ్ డ్రాప్ ఉన్న అల్ట్రా మాస్ మూవీ అసురన్ రీమేక్ రేసు లో ఉండటం అందరికీ భారీ షాక్ నే ఇస్తుందని చెప్పొచ్చు.

బహుశా తాను ఇలాంటి సినిమాలు కూడా తీయగలను అని నిరూపించుకోవాలని అడ్డాల ఈ సినిమా రేసులో ఎంటర్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు కానీ ఇప్పటి వరకు అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఒకవేళ వస్తే ఈ ప్రాజెక్ట్ ను అడ్డాల ఎలా హ్యాండిల్ చేస్తాడా అన్న ఆసక్తి తో సినిమా పై క్రేజ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు.

Leave a Comment