గాసిప్స్ న్యూస్

బ్లాక్ బస్టర్ రాక్షసుడు…2.7 కోట్ల రేటు…హిందీ లో హీరో ఎవరంటే!!

కొన్ని సినిమాలు థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది, సీన్ తర్వాత సీన్ ఏమవుతుందో అన్న ఆత్రుతా హీరో విలన్ ని ఎప్పుడు పట్టుకుంటాడు, విలన్ ఎలా తప్పించుకోవాలని చూస్తాడు అన్న ఆసక్తి ని అడుగడుగునా మెయిన్ టైన్ చేసిన అతి కొద్ది సినిమాల్లో రాక్షసుడు సినిమా కూడా ఒకటి. తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన రాక్షసుడు తెలుగు లో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేయగా…

కెరీర్ లో ఫస్ట్ హిట్ ని ఆ సినిమా తో సొంతం చేసుకున్నాడు. థియేటర్స్ లో ఆ సినిమా చూసిన వాళ్ళ ఎక్సైట్ మెంట్ మరో లెవల్ అనే చెప్పాలి. ఇండియన్ సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ది ఫైనేస్ట్ వెల్ మెయిడ్ సైకో థ్రిల్లర్ మూవీస్ లో ముందు నిలిచే…

సినిమాగా రాక్షసుడు సినిమాను చెప్పుకోవచ్చు. తెలుగు లో రీమేక్ అయిన ఈ సినిమా ఇప్పుడు హిందీ లో కూడా రీమేక్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కింద ఏకంగా 2.7 కోట్ల భారీ రేటు ని సొంతం చేసుకోగా హిందీ లో ఈ సినిమాను…

ఎవరు రీమేక్ చేస్తారు అన్నది ఆసక్తిగా మారగా రీసెంట్ గా హీరో మరియు డైరెక్టర్ కూడా కన్ఫాం అయ్యారని తెలుస్తుంది. హీరోగా బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ ఈ సినిమా రీమేక్ లో మెయిన్ లీడ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక డైరెక్టర్ గా తెలుగు రీమేక్ ని హ్యాండిల్ చేసిన రమేష్ వర్మ నే త్వరలో హిందీ రీమేక్ ను కూడా….

తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. సైకో థ్రిల్లర్ జానర్ మూవీస్ బాలీవుడ్ లో తక్కువే కాబట్టి తమిళ్ తెలుగు లో వచ్చినట్లు ఔట్ పుట్ హిందీ లో కూడా ఉంటే కచ్చితంగా హిందీ లో అల్టిమేట్ విజయాన్ని సెన్సేషనల్ కలెక్షన్స్ ని ఈ రీమేక్ సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

Leave a Comment