గాసిప్స్ న్యూస్

బ్లాక్ బస్టర్ రీమేక్…చిరు లేకుండానే షూటింగ్ చేస్తున్నారా??

బాక్స్ ఆఫీస్ దగ్గర ఖైదీ నంబర్ 150 తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత వరుస పెట్టి సినిమాలు చేయాలి అని భావించిన మెగాస్టార్ చిరంజీవి అనుకోకుండా సైరా నరసింహా రెడ్డి కోసం ఎక్కువ టైం కేటాయించగా తర్వాత ఆచార్య విషయంలో అయినా తొందరగా పూర్తీ చేయాలి అనుకున్నా కరోనా వలన సినిమా మరింత లేట్ అవుతూ వస్తుంది, కానీ 2021 లో మాత్రం రెట్టించిన జోరు తో సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యారు మెగాస్టార్.

ఆచార్య తర్వాత తన అప్ కమింగ్ మూవీ ఏంటి అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయక పోయినా కానీ ముందు లూసిఫర్ రీమేక్ అనుకున్నా తర్వాత ఆ సినిమా కన్నా ముందు వేదాలం రీమేక్ ని మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాడు మెగాస్టార్. మెహర్ రమేష్ డైరెక్షన్ లో…

తెరకేక్కబోతున్న ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ కూడా చేయించుకున్న మెగాస్టార్… సెట్స్ పైకి ఇంకా వెళ్ళక ముందే వేదాలం మూవీ రీమేక్ షూటింగ్ ఆల్ రెడీ మొదలు అయ్యింది అనేది ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. సినిమా షూటింగ్ లో చిరు జాయిన్ అవ్వడానికి…

మరింత టైం పట్టే అవకాశం ఉండటం తో ఈ లోపు కాంబినేషన్ సీన్స్ కాకుండా ఇతర పాత్రల షూటింగ్ జరపాలని డిసైడ్ అయ్యాడట మెహర్ రమేష్, అనుకున్నదే తడవుగా ముందుగా కోల్కతాతో కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ ని ఇప్పుడు జరుపుతున్నారని అంటున్నారు. మెగాస్టార్ లేకుండా షూటింగ్ మొదలు అవ్వడం కొంచం షాక్ ఇచ్చినా కానీ…

మెగాస్టార్ సూచన మేరకే ఇది జరుగుతుందని అంటున్నారు. ముందుగా ఇతర పాత్రల షూటింగ్ ను కంప్లీట్ చేస్తే ఈ లోపు ఆచార్య షూటింగ్ ను కంప్లీట్ చేసి వెంటనే ఈ సినిమా షూటింగ్ కి షిఫ్ట్ అవ్వాలి అన్నది మెగాస్టార్ ఆలోచన అంటున్నారు, ఇది జరిగితే 2021 మెగాస్టార్ 2 సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినా రావొచ్చు అని కూడా అంటున్నారు ఇప్పుడు.

Leave a Comment