గాసిప్స్ న్యూస్

బ్లాక్ బస్టర్ రీమేక్….రామ్ చరణ్ మాట వినని చిరు!

మెగాస్టార్ చిరంజీవి తన అప్ కమింగ్ మూవీస్ లిస్టు లో మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్ ని కూడా యాడ్ చేయ గా ఈ సినిమా ఎప్పుడైతే రీమేక్ అవుతుందని అనౌన్స్ చేశారో ఎదో ఒక వార్త తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది ఈ సినిమా. ఎవరెవరు నటిస్తున్నారని, సినిమా మార్పుల గురించి డైరెక్టర్స్ గురించిన వార్తలు ఎప్పటి కప్పుడు చక్కర్లు కొడు తూనే ఉన్నాయి.

రీసెంట్ గా సినిమా రీమేక్ భాద్యతలను యంగ్ డైరెక్టర్ సుజిత్ నుండి సీనియర్ డైరెక్టర్ వినాయక్ తీసుకున్నారని వార్తలు రాగా.. ఈ విషయం లో రామ్ చరణ్ మాట మెగాస్టార్ వినలేదని టాలీవుడ్ లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆ వార్తల ప్రకారం ముందు రామ్ చరణ్ తో సినిమా కోసం…

వచ్చిన సుజిత్ కి చిరు తో లూసిఫర్ రీమేక్ ని ఆఫర్ చేశాడు రామ్ చరణ్, తర్వాత మార్పులు చేర్పులు కోరిన చిరు సుజిత్ చేసిన మార్పులు నచ్చకపోవడం తో తన ఆస్తాన డైరెక్టర్స్ లో ముందు నిలిచే వినాయక్ కి ఈ సినిమా రీమేక్ భాద్యతలను అప్పగించాలని ఫిక్స్ అయ్యాడు మెగాస్టార్.

దాంతో రామ్ చరణ్ సుజిత్ అయితే యంగ్ డైరెక్టర్ అని కొత్త థాట్స్ తో సినిమా స్టైలిష్ గా డిఫెరెంట్ గా తీస్తారని చెప్పినప్పటికీ… రీమేక్ తో రిస్క్ కాకుండా కొత్త కథతో అలాంటి రిస్క్ చేస్తే బాగుంటుందని, అదే రీమేక్ తో అలాంటి రిస్క్ చేస్తే వర్కౌట్ అవ్వకపోతే తన కెరీర్ కి కూడా ఇబ్బంది అవుతుందని చెబుతూ…

తన ఛాయిస్ గా వినాయక్ ని రంగంలోకి దింపడం తో రామ్ చరణ్ ముందు సుజిత్ కి మాట ఇచ్చాం అని ఆలోచించినా తేడా కొడితే తన కెరీర్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొత్త సినిమా ఛాన్స్ ఇవ్వడమే మంచిది అని భావించాడని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందీ అన్నది తెలియాల్సి ఉంది…

Leave a Comment