న్యూస్ రివ్యూ వీడియో

“భీష్మ” ట్రైలర్ రివ్యూ…నితిన్ గట్టిగా కొట్టడం ఖాయం!!

కెరీర్ లో వరుస పరాజయాలను ఎదురుకున్న హీరో నితిన్ 2012 లో ఇష్క్ సినిమాతో మళ్ళీ మంచి కంబ్యాక్ ఇవ్వగా వెంటనే గుండె జారి గల్లంతైందే తో బ్లాక్ బస్టర్ కొట్టాడు, కానీ తర్వాత చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరుస్తూ రాగా మళ్ళీ చాలా కాలానికి నితిన్ నుండి వస్తున్న సినిమా ఏదైనా మంచి బజ్ ని సొంతం చేసుకుందా అంటే అది కచ్చితంగా లేటెస్ట్ మూవీ “భీష్మ” అనే చెప్పాలి.

ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా రీసెంట్ గా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే నితిన్ ఈ సారి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నాడని చెప్పొచ్చు. స్టొరీ రెగ్యులర్ గానే అనిపిస్తున్నా…

నితిన్ రష్మిక ల ఫ్రెష్ పెయిర్, ఎంటర్ టైన్ మెంట్ సీన్స్, యాక్షన్ సీన్స్ తో పాటు సోషల్ మెసేజ్ లతో ట్రైలర్ లో ఆకట్టుకోవడం తో ట్రైలర్ కి ఇన్స్టంట్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుందని చెప్పాలి. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ లో ఆకట్టుకునే విధంగా ఉండగా… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా భారీ గా ఉన్నాయని చెప్పాలి.

ఛలో తో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకీ కొడుముల ఈ సారి కూడా ఆ మ్యాజిక్ ని రిపీట్ చేసేలా ఉన్నాడు, ట్రైలర్ లో చూపెట్టిన ఎంటర్ టైన్ మెంట్ అండ్ యాక్షన్ సీన్స్ మరియు సోషల్ మెసేజ్ కచ్చితంగా చప్పగా సాగుతున్న ఫిబ్రవరి బాక్స్ ఆఫీస్ సీజన్ కి ఈ సినిమా ఊపు నిచ్చే అవకాశం ఉంది.

ఓవరాల్ గా ట్రైలర్ సినిమా పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను మరింత పెంచేసి, నితిన్ కచ్చితంగా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయం అన్న ఫీలింగ్ ని కలిగిస్తుందని చెప్పాలి. ఇక సినిమా కూడా అలరించి నితిన్ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుందామ్…మీరు కూడా ట్రైలర్ చూసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

Leave a Comment