న్యూస్ బాక్స్ ఆఫీస్

భీష్మ డే 3 కలెక్షన్స్…ఇదేమి ఊచకోత సామి!!

నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా 2 రోజులు పూర్తీ అయ్యే సరికి 13.5 కోట్ల లోపు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని సత్తా చాటగా… సినిమా ఇప్పుడు మూడో రోజు లో ఎంటర్ అవ్వగా… ఆదివారం అడ్వాంటేజ్ ను వాడుకుంటున్న సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ సత్తా చాటుతుంది, సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ…

షోలకు రెండో రోజు తో పోల్చితే కేవలం 5% లోపే డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి సినిమా భారీ గా గ్రోత్ ని సాధిస్తూ దూసుకు పోతుంది, ఓవరాల్ గా గ్రోత్ 15% వరకు ఉన్నట్లు సమాచారం. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా సాలిడ్ గా ఉన్నాయట.

దాంతో ఇప్పుడు రెండో రోజు తో పోల్చితే మూడో రోజు కూడా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో మినిమమ్ 4 కోట్ల కి తక్కువ కానీ వసూళ్ళ ని సినిమా ఇప్పుడు 3 వ రోజు సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 5 కోట్లకు తక్కువ కాని కలెక్షన్స్ ని మరోసారి సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు. ఓవర్సీస్ లో సినిమా హాల్ఫ్ మిలియన్ వైపు అడుగులు వేస్తూ దూసుకు పోతుండగా… లాంగ్ రన్ లో 1 మిలియన్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ఫస్ట్ వీకెండ్ ని పూర్తీ చేసుకోబోతుంది భీష్మ సినిమా. ఇక ఇదే జోరు వర్కింగ్ డేస్ లో కూడా కొనసాగిస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దానికన్నా త్వరగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. ఇక మొదటి వీకెండ్ అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment