న్యూస్ బాక్స్ ఆఫీస్

“భీష్మ” ఫస్ట్ డే ఓపెనింగ్స్….షాకింగ్ ఓపెనింగ్స్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి అన్ సీజన్ గా పరిగణిస్తారు, అలాంటి ఫిబ్రవరి సీజన్ లో టాలీవుడ్ కి ఒక సూపర్ హిట్ కావాల్సిన టైం లో అంచనాల ను పెంచేసిన భీష్మ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నేడు భారీ ఎత్తున రాగా… సినిమా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 700 వరకు థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా 1000 వరకు థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది.

కాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు మూడు రోజుల ముందే మొదలు అయినా రెస్పాన్స్ మాత్రం బిలో యావరేజ్ గా ఉంది, కాగా రిలీజ్ రోజు ముందు రోజు వరకు ఓవరాల్ బుకింగ్స్ 20% కన్నా తక్కువగా ఉండగా రిలీజ్ రోజు మార్నింగ్ షో సమయానికి…

ఓవరాల్ బుకింగ్స్ 30% రేంజ్ లో ఉంది, కానీ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం తో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకుంటూ ఉండగా మ్యాట్నీ బుకింగ్స్ నుండి సినిమా రాంపేజ్ మొదలు అవుతుందని చెప్పాలి. మ్యాట్నీ బుకింగ్స్ 40% కి రీచ్ అయింది, ఇంకా పెరుగుతూనే ఉండటం తో సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి….

మరింత గ్రోత్ ని సాధించి దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంది, మార్నింగ్ షోల రెస్పాన్స్ ఫుల్ పాజిటివ్ గా ఉండటం, ఈ రోజు మహా శివరాత్రి అవ్వడం తో ఈవినింగ్ అండ్ నైట్ షోల రేంజ్ సాలిడ్ గా పెరగడం ఖాయం. ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి గమనిస్తే సినిమా మొదటి రోజు ఇప్పుడు…

3.5 కోట్ల నుండి 3.8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయం. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ ని బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి 4 కోట్ల నుండి 4.3 కోట్ల మధ్యలో షేర్ ని మినిమమ్ అందుకోవచ్చు. అంత కన్నా ఎక్కువ వెళ్ళే అవకాశం కూడా పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇక రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Comment