న్యూస్ బాక్స్ ఆఫీస్

భీష్మ 4 వ రోజు కలెక్షన్స్…వీర లెవల్ కుమ్ముడు ఇది!!

నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని సాలిడ్ గా ముగించింది, సినిమా అనుకున్న అంచనాలను మించే రేంజ్ లో వసూళ్ళ ని సాధించిన వీకెండ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ టార్గెట్ లో చాలా మొత్తాన్ని వెనక్కి రాబట్టిన సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టింది. కాగా సోమవారం బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి అఫీషియల్ వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోగా…

బాగానే హోల్డ్ చేసిందని చెప్పాలి, మామూలు వీకెండ్ తర్వాత ఎ సినిమా అయినా వర్కింగ్ డేస్ లో 50 – 60% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకోవడం కామన్, ఇక్కడ భీష్మ అన్ సీజన్ అయిన ఫిబ్రవరి లో ఉన్నా వీకెండ్ కుమ్మేయగా వర్కింగ్ డే లో ఎలా…

హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా 4 వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సుమారు గా 50 టు 60% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి వచ్చే సరికి సినిమా తిరిగి గ్రోత్ ని సాధించి మళ్ళీ హోల్డ్ చేసింది.

ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి 5 టు 8% వరకు గ్రోత్ ని సాధించిన సినిమా ఓవరాల్ గా రోజు ని బాగానే ముగించ బోతుంది, మొత్తం మీద ఈ రిపోర్ట్స్ ని బట్టి చూస్తె సినిమా మినిమమ్ 1.8 కోట్ల రేంజ్ షేర్ ని 4 వ రోజు అందుకోవడం ఖాయమని చెప్పాలి. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి…

చూస్తె అన్నీ అనుకున్నట్లు జరిగితే 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకోవచ్చు, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు మొత్తం మీద 2.3 కోట్ల దాకా షేర్ ని మినిమమ్ అందుకునే అవకాశం ఉంది, మొత్తం మీద ఇది సాలిడ్ హోల్డ్ అనే చెప్పాలి. ఇక అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment